Rashmika.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని, వరుస చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమెకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. అందుకే రష్మిక ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోందన్న విషయం అందరికీ తెలుసు. ఇదిలా ఉండదా ఈమె అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
యాక్సిడెంట్ కి గురైన రష్మిక..
ఇప్పటివరకు ఈమె పబ్లిక్ లో అలాగే సోషల్ మీడియాలో కనిపించి చాలా రోజులే అవుతోంది. దాదాపు నెల రోజులుగా పెద్దగా యాక్టివ్ గా ఉండలేదు. దీంతో ఏమైపోయింది రష్మిక అంటూ అభిమానులు కంగారు పడిపోగా.. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. తనకు చిన్న ప్రమాదం జరిగిందని, అందుకే తాను నెలరోజులుగా సోషల్ మీడియాలో కానీ అటు పబ్లిక్ లో కానీ కనిపించలేదు అంటూ తెలిపింది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను అని , వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానంటూ తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని కూడా చెప్పుకొచ్చింది.
రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు..
అన్ని పరిస్థితులను తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని , తెలిపిన ఈమె అందరూ కూడా అలాగే ఉండాలని, ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కూడా తెలిపింది. ఎందుకంటే జీవితం చాలా చిన్నది అని, నష్టాలు జరగవచ్చు అని, అసలు మనకు రేపు అనేది ఉంటుందో లేదో కూడా తెలియదని తెలిపింది రష్మిక. అందుకే ప్రతిరోజు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలని కామెంట్ చేసింది. ఇక తాను మరో అప్డేట్ ఇస్తున్నానని , ప్రస్తుతం ఎన్నో లడ్డూలు తింటున్నానని తెలిపింది. మొత్తానికైతే రష్మిక యాక్సిడెంట్ కు గురయ్యానని చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచి, ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడిందని చెప్పి అందరిని కూల్ చేసింది.
రష్మిక సినిమాలు..
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న ఈమె.. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఇకపోతే ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉండడం వల్ల డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి ఆ తేదీలోనైనా విడుదల చేస్తారా.? మరేదైనా కారణం చెప్పి వాయిదా వేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇటీవలే హిందీలో యానిమల్ సినిమా చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బోల్డ్ గా నటించి మరింత గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా ఇలా చెప్పేసరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా త్వరగా కోలుకొని సెట్ లో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
View this post on Instagram