Rashmika Mandanna : టాలీవుడ్ తో సహా పాన్ ఇండియా వైడ్ గా త్వరలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లలో పుష్ప2 కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఫైనల్ గా డిసెంబర్ 6న రిలీజ్ కి రెడీ అవుతుంది. షూటింగ్ డిలే కారణంగా మూవీని వాయిదా వేయగా, ఆల్మోస్ట్ ఫినిషింగ్ దశకు చేరుకుందని సమాచారం. ఇక పుష్ప2 సినిమా నిజానికి ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా, పుష్ప వస్తుందని చెప్పి ఎన్ని సినిమాలు ఆ డేట్ నుండి తప్పుకున్నాయో తెలిసిందే. కానీ పుష్ప2 అక్కడి నుండి, డిసెంబర్ కి వచ్చి సెటిలయ్యారు. అయితే డిసెంబర్ లో కూడా కొన్ని సినిమాలు పుష్ప రాజ్ తో క్లాష్ కి రెడీ అయ్యాయి. కానీ లాస్ట్ మినిట్ లో తప్పుకున్నాయి. ఇదిలా ఉండగా పుష్ప రాజ్ తో ఢీ కొట్టడానికి ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మికనే రెడీ అయింది.
పుష్ప రాజ్ నే ఢీకొంటున్న రష్మిక…
తాజాగా అల్లు అర్జున్ తో రష్మిక నే ఢీ కొట్టడానికి రెడీ అవుతుంది. అవును.. రష్మిక మందన్న రష్మిక మందన్న హీరోయిన్ గా బాలీవుడ్ లో “చ్హావా” పేరుతో భారీ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుండగా, లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మద్యక్ ఫిల్మ్స్’ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా యేసుబాయ్ భోంస్లే పాత్రలో నటిస్తుంది. తాజాగా డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫిషియల్ గా కంఫర్మ్ చేసారు. అంటే పుష్ప2 వస్తున్న అదే డేట్ కి రష్మిక చ్ఛావా విడుదల అవుతుందన్నమాట.
తన సినిమాతోనే పోటీ..
ఇక పుష్ప2 లో కూడా హీరోయిన్ రష్మిక నే అని తెలిసిందే. అలాగే చ్ఛావా లో కూడా తానే హీరోయిన్. ఒక రకంగా తన సినిమాతోనే పోటి పడుతుందని చెప్పాలి. అయితే అసలు పుష్ప రాజ్ తో ఎవరు డీ కొంటారు అంటూ స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతుండగా, బాలీవుడ్ నుండి మాత్రం చ్ఛావా సినిమాని అదే రోజు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే పీరియాడిక్ సినిమా కావడంతో టఫ్ ఫైట్ ఉండనుందని తెలుస్తుంది. ఇక పుష్ప2 నుండి త్వరలో మూడో సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.