Tollywood : ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పై రేప్ కేసు.. అసలు మ్యాటర్ ఇదే..?

Tollywood : ఈ మధ్య ఇండస్ట్రీలో రోజుకో లైంగిక వేధింపుల వార్త వినిపిస్తుంది.. కొందరు వ్యక్తులు లైంగికంగా వాడుకున్నారని అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల రాజ్ తరుణ్, లావణ్య ల కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టించింది. అది మరువక ముందే ఇప్పుడు మరో కేసు వార్త ఇండస్ట్రీని షేక్ అయ్యేలా చేస్తుంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కొరియోగ్రాఫర్ అయిన డ్యాన్స్ మాస్టర్ పై ఓ నటి లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని ఏ క్షణమైనా అరెస్ట్ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు సినిమాల గురించి తప్ప మరొకటి లేదు. కానీ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మొన్నటివరకు చిన్న చిన్న వ్యక్తుల పై లైంగిక ఆరోపణల కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా నెంబర్ వన్ స్థానంలో ఉన్న వాళ్లపై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ట్రెండింగ్ లో ఉంది. ఈ కేసు గురించి ఇంకా ఒక సొల్యూషన్ రాకముందే ఇప్పుడు మరో కేసు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసిన డ్యాన్స్ మాస్టర్ పై రేపు కేసు నమోదు అయ్యింది.

జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు..

అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్స్ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతున్నాయి. మొన్న రాజ్ తరుణ్, నిన్న స్టార్ ప్రొడ్యూసర్ ఈరోజు డ్యాన్స్ మాస్టర్.. ఓ నటి మాస్టర్ పై రేప్ కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ఈయన ఇండస్ట్రీలో పేరున్న మాస్టర్. అందులోనూ స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు జానీ మాస్టర్ ( Jhony Mater). గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

- Advertisement -
rape-case-of-popular-tollywood-dance-master
rape-case-of-popular-tollywood-dance-master

ఇక ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 , క్రిమినల్ బెదిరింపు, స్వచ్ఛందంగా గాయపరచడం లోని క్లాజ్ మరియు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.. జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.. ఇక రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటాడు. ప్రస్తుతం ఈయన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని జానీ మాస్టర్.. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు