Rao Ramesh.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR) నాటి కాలంలో రావు గోపాల్ రావు (Rao Gopal Rao)తన అద్భుతమైన కామెడీతో, విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ పండించడానికి అయినా, విలనిజం చూపించడానికి అయినా సరే ఈయన తర్వాతే ఎవరైనా.. అంతటి గుర్తింపు తెచ్చుకున్న రావుగోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రావు రమేష్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఏ పాత్రలో అయినా సరే లీనం అయిపోయి మెప్పిస్తున్నారు.
హీరో రేంజ్ లో గుర్తింపు..
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విభిన్న క్యారెక్టర్లలో తనని తాను ప్రూవ్ చేసుకొని కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్న ఈయన ఒకానొక సమయంలో తెలుగులో లీడింగ్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ యాక్టర్లలో ఒకరిగా చలామణి అవుతున్న ఈయన ఒకప్పటిలా స్పీడుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఒప్పుకోవడం లేదు. సెలెక్టివ్ గా పాత్రలు ఎంపిక చేసుకుంటూ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంది అని తెలిస్తేనే ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పాత్రకు తగ్గ పారితోషకం కూడా డిమాండ్ చేస్తున్నారు.
రోజుకి రూ .4.5 లక్షల కంటే ఎక్కువే..
ఇక తాజాగా ఈయన పారితోషకం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. యంగ్ హీరోలు కూడా ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోవట్లేదు అంటూ వాపోతున్నారు. అసలు విషయంలోకి వెళితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రావు రమేష్ ఒక రోజుకి రూ.4.5 లక్షల వరకు పారిపోషకం తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని బట్టి చూస్తే.. ఒక్క రోజుకి ఇంత పారితోషకం అంటే.. సినిమా ముగిసేసరికి ఆయన పారితోషకం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలి అంటే యంగ్ హీరో కంటే ఎక్కువే ఈయన పారితోషకం తీసుకుంటున్నారు.
పాత్ర నచ్చితే తక్కువ పారితోషకం కూడా ఓకే..
ఇదిలా ఉండగా రావు రమేష్ తాజాగా లీడ్ రోల్ పోషించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా తాజాగా థియేటర్లలో కొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒక విధంగా ఈ సినిమాలో రావు రమేష్ హీరో అని చెప్పవచ్చు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చిత్రంగా అందరికీ బాగా కనెక్ట్ అయింది ఈ చిత్రం. ఇదిలా ఉండగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సక్సెస్ అయిన సందర్భంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో బాగానే ఒక ఛానల్లో తన పారితోషకం గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఒకానొక సమయంలో తాను రోజుకు రూ .4.5 లక్షల కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న సందర్భం ఉందని, అయితే ప్రతి రూపాయి కూడా వైట్ లోనే తీసుకుంటానని తెలిపారు. అంతేకాదు తన పారితోషకానికి తగిన టాక్స్ కూడా కడుతున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పాత్ర నచ్చితే తక్కువ పారితోషకం కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.