Ram Charan: మన జనరేషన్ లో నాకు ఇష్టమైన హీరోయిన్ అంటే ఆవిడే

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని, సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఏ హీరో కైనా వారసత్వం అనేది కొంతమేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లకు ఉన్న ఓన్ టాలెంట్ వలన వాళ్ళు జీవితంలో ఏ స్థాయికి వస్తారు అనేది వాళ్ళు చేసే సినిమాలు, వాళ్ళు ఎంచుకొని కథలు వాళ్ళు ప్రవర్తించే తీరు ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. ఇక చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

రామ్ చరణ్ తేజ్ రెండవ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక మగధీర సినిమా చరణ్ కెరియర్ కు ఎంత పెద్ద ప్లస్ అయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా చరణ్ టాలెంట్ బయటకు వచ్చింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇక ధ్రువ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ ను చూసే తీరు మారిపోయింది. రంగస్థలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును సుకుమార్ ఆ సినిమాతో బయటికి తీశాడు.

Rangasthalam

- Advertisement -

ఇక తన కెరీర్ లో చాలామంది హీరోయిన్స్ తో పనిచేశాడు రామ్ చరణ్. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ పనిచేసిన హీరోయిన్స్ లో తనకు ప్రత్యేకంగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగితే. దానికి సమాధానం గా ప్రత్యేకంగా వీళ్ళు అంటే చెప్పలేను నేను మొదటి నుంచి ఇప్పటివరకు పని చేసిన వాళ్లంతా కూడా మంచి పర్ఫామెర్స్ నాకు వారందరూ ఇష్టమే అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ జనరేషన్ లో చూసుకుంటే అందరికంటే సమంత బెటర్ అని చెప్పొచ్చు అంటూ నార్మల్ చెప్పాడు రామ్ చరణ్. వీరిద్దరి కెమిస్ట్రీ రంగస్థలం సినిమాలో ఎంతలా వర్కౌట్ అయిందో అందరికీ తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు