Rakul Preet Singh : గత దశాబ్దం పాటు తెలుగు చిత్ర సీమలో అగ్రనటిగా వెలుగొంది ప్రస్తుతం టాలీవుడ్ కు దూరమైన సీనియర్ హీరోయిన్లలో పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ బ్యూటీ పెళ్లయ్యాక సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తాజాగా పెళ్ళికి ముందు వేరొకరితో తన రిలేషన్షిప్ ఎలా బ్రేక్ అయ్యింది అనే విషయం గురించి ఓపెన్ అయ్యింది. మరి రకుల్ పెళ్ళికి ముందు ఎవరితో ప్రేమాయణం నడిపింది? ఎందుకు బ్రేకప్ చెప్పిందో ఒక లుక్కేద్దాం పదండి.
పెళ్ళికి ముందు ప్రేమ, బ్రేకప్
ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ లో అవకాశాలు కరువు కావడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. పనిలో పనిగా హిందీ నిర్మాత జాకీ భగ్నానిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే పెళ్లికి ముందు తన రిలేషన్‌షిప్ గురించి తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది రకుల్. తన భర్త జాకీ భగ్నానిని కలిసిన తర్వాత రిలేషన్షిప్ పై తన ఆలోచనా విధానం ఎలా మారిందో స్పష్టంగా వివరించింది. జాకీని కలవడానికంటే ముందు హెల్దీ రిలేషన్ అంటే ఏమిటో తనకు పెద్దగా తెలియదని చెప్పిన రకుల్, అప్పట్లో వేరే వ్యక్తితో తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రకుల్ పుడ్ కారణంగా తన మాజీ లవర్ కు బ్రేకప్ చెప్పిందట. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ “మేము ఒక హోటల్ కు వెళ్ళినప్పుడు అతని ఫుడ్ సెలెక్షన్ నాకు నచ్చలేదు. అతను ఒక వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేసాడు. అది నాకు ఇష్టం లేదు. ఇదే కారణం విడిపోవడానికి దారి తీసింది. ఎందుకంటే అతను నా ఆహారపు అలవాట్లను అంచనా వేస్తున్నట్లు నాకు అనిపించింది” అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. కానీ ఎవరితో బ్రేకప్ అయ్యింది అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది.
జాకీ వల్లే ప్రేమ అంటే ఏంటో తెలిసింది
కాగా జాకీని కలిశాక రకుల్ జీవితం కొత్త మలుపు తిరిగిందట. అతనికి ఉన్న అవగాహన, తనకు ఆయన ఇచ్చే సపోర్ట్ గురించి మాట్లాడుతూ జాకీకి రకుల్ కృతజ్ఞతలు తెలియజేసింది. తన బిజీ షూటింగ్ షెడ్యూల్‌లలో కూడా జాకీతో టైమ్ స్పెండ్ చేయడానికి చేతనైన ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చింది. ఇదే పాడ్ కాస్ట్ లో రకుల్ నెపోటిజంపై కూడా మాట్లాడింది. నెపోటిజం తప్పు కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దానివల్ల తాను కూడా అవకాశాలు కోల్పోయాను అని చెబుతూనే, స్టార్ కిడ్స్ కు అవకాశాలు వస్తున్నాయి అంటే అది వాళ్ళ తల్లిదండ్రుల కష్టమని రకుల్ వెరైటీ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు రేపు తన పిల్లలకు సహాయం అవసరం అయితే తాను తప్పకుండా చేస్తాను అని వెల్లడించింది. ఇప్పుడేమో మాజీ లవర్, బ్రేకప్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.