Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మనందరికీ పరిచయమైంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ మెప్పించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలను కాస్త తగ్గించింది.
తెలుగులో కొండపొలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్ళింది. ఈ మధ్యకాలంలోనే హిందీ యువ నిర్మాత జాకీ భగ్నానినీ వివాహం చేసుకుంది. వీరి వివాహం ఫిబ్రవరి 21న గోవాలో ఫైవ్ స్టార్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ అనంతరం రకుల్ (Rakul Preet Singh) తన భర్తతో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా…. తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై రకుల్ (Rakul Preet Singh) సంచలన కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ చాలా మంచి వాడని, అతని వల్ల ఇండస్ట్రీకి మంచి పేరు వచ్చినట్లు తెలియజేసింది.
సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తానని అల్లు అర్జున్ (allu arjun) తనతో చెప్పినట్లుగా వివరించింది రకుల్. ఇక దానికి తగినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడని చెప్పింది. అయితే ఇక్కడ మెగా కుటుంబానికి సంబంధించిన ఏ హీరోలను కూడా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మెచ్చుకోకుండా కేవలం అల్లు అర్జున్ ను మాత్రమే మెచ్చుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా…. తెలుగు లో ఎన్నో సినిమాల లో నటించిన రకుల్ ఒక్కసారిగా ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయకుండా హిందీలో మాత్రమే నటిస్తోంది. అక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోతుంది. మరి వివాహమైన తర్వాత ఈ భామ సినిమాల్లో నటిస్తే ఏమైనా తన కెరియర్ మారుతుందేమోనని అభిమానులు అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఈమెకు సినిమాలలో ఎలాంటి అవకాశాలు రావడం లేదు. మరి భవిష్యత్తులో ఎలాంటి సినిమా అవకాశాలు వస్తాయో చూడాలి. హిందీలో వచ్చినా రాకపోయినా తెలుగులో రకుల్ కు అవకాశాలు రావాలని, మళ్లీ ఎప్పటిలాగే తెలుగు సినిమాలలో నటించి గొప్ప స్థాయికి చేరుకోవాలని అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అభిమానులు కోరుకుంటున్నారు. Rakul Preet Singh Comments On Allu Arjun Over Tollywood