Raj Tarun – Lavanya: మరో ఊహించని ట్విస్ట్.. దొంగతనం చేశాడంటూ.. సాక్ష్యాలతో..?

Raj Tarun – Lavanya.. ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), ఆయన ప్రేయసి లావణ్య (Lavanya) కేసులో రోజుకొక ట్విస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రేమించాడని , పెళ్లి చేసుకున్నాడని, గర్భం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని, ఇంకొక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అని , వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని ఇలా పలు ఆరోపణలు చేస్తూ.. నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరొక ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా రాజ్ తరుణ్ దొంగతనం చేశాడంటూ లావణ్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Raj Tarun - Lavanya: Another unexpected twist.. Stealing.. with evidence..?
Raj Tarun – Lavanya: Another unexpected twist.. Stealing.. with evidence..?

రాజ్ తరుణ్ దొంగతనం చేశాడంటూ ఆరోపణలు..

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ దొంగతనం చేశాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. తన బంగారం, పుస్తెలతాడు, తాళిబొట్టు ను రాజ్ తరుణ్ దొంగలించాడని, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది. అంతేకాదు గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా అనేక ఆధారాలు తనతో ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. నగలు బీరువాలో దాచానని , ఆ బీరువా తాళాలు రాజ్ తరుణ్ తోనే ఉన్నాయని , తనకు తెలియకుండా రాజ్ తరుణ్ ఆ నగలు దొంగలించాడని , అందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

లావణ్య , రాజ్ తరుణ్ కేసులో శేఖర్ భాషా..

గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ , లావణ్య కేసు రోజుకొక మలుపు తీసుకుంటోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేసిన తర్వాత రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ.. ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుందని, ఆ కారణంతోనే ఆమెకు దూరంగా ఉంటున్నాను అంటూ కూడా తెలిపారు. ఇక దీనికి తోడు రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా కూడా లావణ్య పై దాడికి దిగాడు. ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు కూడా.. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేస్ నమోదు చేయించి, ఆ ఫైల్ మీడియా ముందు చూపెట్టింది.

- Advertisement -

రాజ్ తరుణ్ కు శిక్ష తప్పదా..?

అయితే ఆ తర్వాత శేఖర్ భాషా కూడా.. లావణ్య కాపు కాచి తన రౌడీలతో తనపై దాడి చేయించిందని తన చేయి విరగ్గొట్టింది అని కూడా కామెంట్లు చేశారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే వీటిపై పోలీసులు ఎంక్వైరీ చేయగా రాజ్ తరుణ్ తప్పు ఉందని, ఆమెతో అతడు 10 సంవత్సరాలు సహజీవనం చేసి ఇప్పుడు ఆమెను వదిలేసాడు అంటూ దాంతో అతడి పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. అయితే ఈ విషయంపై రాజ్ తరుణ్ తన ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో తప్పించుకున్నాడు. ఇప్పుడు మరొక నింద ఆయనపై పడింది. ఈ నింద నుంచి బయటకు వస్తాడా? మరి ఇది నిజమవుతుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు