Pushpa 2: సుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా ఒక సంచలనం. వీరి కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసుకున్నా కూడా ఆర్య సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అల్లు అర్జున్ స్టార్ హీరో చేసింది ఆర్య సినిమా అని చెప్పాలి. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ కి ఒక సెపరేట్ గుర్తింపు వచ్చి తనకంటూ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు.
ఆ తర్వాత మీరు కాంబినేషన్లో ఆర్య 2 అనే ఒక సినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది. ఇక ఆర్య 2 సినిమా తర్వాత మీరు కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మాట్లాడుతారు. దీని కారణం ఈ సినిమా చూపించిన ఇంపాక్ట్. సుకుమార్ ఈ సినిమాను డిజైన్ చేసిన విధానం. అల్లు అర్జున్ ఈ సినిమాలో పర్ఫామెన్స్ ఇచ్చిన విధానం ఇవన్నీ కూడా సినిమాను వేరే రేంజ్ లో నిలబెట్టాయి.
పుష్ప సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ రానుంది. అప్పట్లో పుష్ప సినిమా డైలాగ్స్ విపరీతంగా చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా చాలామంది వాడారు. ఇక పుష్ప సినిమా కి సీక్వెల్ డిసెంబర్ 6న రాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ జనరల్ గా రిలీజ్ కి ముందు కొన్ని సినిమాలు గురించి నేను చెప్పను. అలా చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. కానీ పుష్పటు మాత్రం అస్సలు తగ్గేదే లే అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు.
ఇక అల్లు అర్జున్ మాట్లాడుతున్న ఈ మాటలతో చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమా విషయంలో దర్శకుడికి హీరోకి విభేదాలు వచ్చాయని, సినిమా ప్రాసెస్ ఇంకా డిలే అవుతుందని,అనుకున్న టైం కి రిలీజ్ కాకపోవచ్చని అనేక వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ కూడా అల్లు అర్జున్ ఈ స్పీచ్ తో చెక్ పెట్టాడు అని చెప్పాలి. అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కచ్చితంగా డిసెంబర్ 6న పుష్ప సినిమా రిలీజ్ అవుతుందని కన్ఫామ్ అయిపోవచ్చు.