Puri Jagannath : టాలీవుడ్ లో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి ఉండే క్రేజే వేరని చెప్పాలి. ఈ జెనరేషన్ లో అత్యంత ఫాస్ట్ గా సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే. ఒక హీరోని మాస్ హీరోలా పర్ఫెక్ట్ గా ప్రెజెన్స్ చేయాలంటే పూరీని మించిన వాళ్ళు టాలీవుడ్ లో లేరని అంటుంటారు. ఒక్కోసారి రాజమౌళి లాంటి దిగ్దర్శకులు కూడా పూరీని చూసి తాము ఎంతో నేర్చుకోవాలని అంటుంటారు. అలాంటి స్టార్ డమ్ అనుభవంచిన దర్శకుడు పూరి జగన్నాథ్, కొన్నేళ్లుగా తన స్థాయిలో సినిమాలు తీయడమే మానేసాడు. పూరి ఫ్యాన్స్ కూడా తనని చాలా మిస్ అయ్యారని చెప్పాలి.
గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ నుండి వచ్చిన సరైన పర్ఫెక్ట్ మాస్ సినిమా ఏదైనా ఉందంటే “టెంపర్” మాత్రమే. దాని తర్వాత వచ్చిన సినిమాల్లో అన్ని దాదాపుగా డిజాస్టర్లయ్యాయి. మధ్యలో ఒక్క “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించగా, ఆ సినిమా ఏదో ఫ్లో లో హిట్ అయిందని చాలా మంది అంటుంటారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ కన్నా పాటలు, రామ్ యాక్టింగ్, హీరోయిన్ గ్లామర్ షో ఇలా చాలా విషయాల వల్ల సినిమా సక్సెస్ అయింది. దీని తర్వాత కూడా పూరి జగన్నాథ్ వరుస డిజాస్టర్లు లు అందుకోగా, కం బ్యాక్ ఇవ్వాలని మళ్ళీ “డబుల్ ఇస్మార్ట్” సీక్వెల్ తీసేసాడు. ఈ సినిమా తీస్తున్నప్పుడు కూడా సోషల్ మీడియాలో.. ఇలాంటి సినిమాని ఎందుకు తీస్తున్నారు సార్… ఒక బిజినెస్ మెన్, పోకిరి లాంటి సినిమాలకు సీక్వెల్ తీయొచ్చుగా అని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేసారు.
నెగిటివ్ రెస్పాన్స్ డబుల్..
ఫైనల్ గా పూరి జగన్నాథ్ – రామ్ తో తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలిడే వీకెండ్ వల్ల ఓపెనింగ్స్ బాగా రావొచ్చేమో గాని, బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే సినిమా చూసిన ఆడియన్స్ నుండి మాత్రం ఒకే రకమైన మాట వినిపిస్తుంది. పాత కథనే మళ్ళీ తీసాడు అని. పూరి జగన్నాథ్ గత చిత్రాలు కూడా ఇలాగే ఉన్నాయని చూస్తే తెలుస్తుంది. కాకపోతే హీరోలకి తగ్గట్టుగా వేరియేషన్స్ మారతాయి. ఈ విషయంలో తన గురూజీ రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుతున్నాడు హరీష్ శంకర్.
గురూజీని ఫాలో అవుతున్న పూరి..
ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) రామ్ గోపాల్ వర్మ శిష్యుడని తెలిసిందే. తాను తీసే చాలా సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ మార్క్ కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా డబుల్ ఇస్మార్ట్ గాని, దీనికి ముందు తీసిన రోగ్, లోఫర్, ఇజం లాంటి సినిమాలన్నీ పూరి గతంలో తీసిన సినిమాలకు కాపీలా ఉంటాయి. ఒకే కథని, కథనాన్ని తిప్పి తిప్పి కొడతాడని అంటున్నారు జనాలు. ఈ విషయంలో ఆర్జీవీ ని ఫాలో అవుతున్నాడని చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ కూడా ఒకప్పుడు తన హిట్ అయిన సినిమాలని మార్చి మార్చి మళ్ళీ తీసేవాడు. ముఖ్యంగా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన వంగవీటి, పరిటాల రవి హత్యల నేపథ్యంలో ఎన్నో సినిమాలు తీసాడు రామ్ గోపాల్ వర్మ. గాయం, వంగవీటి, బెజవాడ లాంటి సినిమాలు ఒకే కథలు. అలాగే అంతం, సత్య, కంపెనీ సినిమాల కథలు కూడా ఒకే నేపథ్యంలో తెరకెక్కగా, వీటినే తిప్పి తిప్పి కొట్టాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా కొత్త కథలు రాయకుండా ఒకే రకమైన కథలతో ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు.