TheRajasaab : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ” ది రాజాసాబ్” ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేస్తున్న పక్కా మాస్ మసాలా మూవీ కాబట్టి అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటివరకు ప్రకటించకపోగా, సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
వరుస ప్లాపులందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) ఒకటి. అయితే ఈ బ్యానర్ లో కొన్నాళ్ల నుండి వస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. టక్కర్, బ్రో, రామబాణం, ఈగల్ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసిన ఆది పురుష్, లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్.. ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. మధ్యలో మనమే ఒక్కటి ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ క్రమంలో భారీ నష్టాలు అందుకున్న ఈ బ్యానర్ నుండి నష్టాలు ఎలా భర్తీ చేస్తారన్న ప్రశ్న మీడియా నుండి వచ్చినదానికి నిర్మాత విశ్వ ప్రసాద్ (VishwaPrasad) ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.
రాజాసాబ్ మా నష్టాలన్నీ పూడ్చేస్తుంది పూడ్చేస్తుంది..
తాజాగా శ్రీవిష్ణు తో స్వాగ్ (Swag) అనే సినిమా నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరి ఈ సినిమా టీజర్ లాంచ్ ఆనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫెయిల్యూర్స్ గురించి ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సందర్బంగా టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తమ సినిమాలు ఫెయిల్ అవుతున్న విషయం నిజమే. లాస్ట్ సినిమా కూడా ఫెయిల్ అయింది. కానీ అంతకు ముందు వచ్చిన మనమే బాగానే ఆడింది. అయితే ‘రాజాసాబ్’ (TheRajasaab) త్వరలో ఏప్రిల్ లో వస్తుంది. ఆ సినిమా మాకు వచ్చిన నష్టాలన్నీ పూడ్చేస్తుందని విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక రాజాసాబ్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకోసం అదిరిపోయే ట్యూన్స్ ని సిద్ధం చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.