Prabhas: కల్కి సినిమా ట్రైలర్ డేట్ ఫిక్స్

Prabhas: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ఇప్పటికే ఈ సినిమా పైన మంచి అంచనాలు మొదలయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. దాదాపు 600 కోట్ల పైగా బడ్జెట్ తో వైజయంతి బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా కోసం బుజ్జి అనే ఒక వెహికల్ ను ప్రత్యేకంగా తయారు చేశారు. రీసెంట్ గా ఈ వెహికల్ గురించి ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈవెంట్ లో బుజ్జిని రివిల్ చేశారు.

 

బుజ్జి పాత్ర కీలకం

ఇకపోతే బుజ్జి అనే పేరు చిన్నది కాదు కావచ్చు కానీ సినిమాలో మాత్రం బుజ్జి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని ఇదివరకే నాగార్జున్ చెబుతూ వచ్చాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ దీపికా పదుకొనే అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కనిపించనున్నారు. ఈ సినిమా పార్ట్ లో కమల్ హాసన్ కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించిన రెండవ పాట్లు దాదాపు 90 నిమిషాల పాటు ఉంటాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం నాలుగు పార్ట్స్ లో వస్తుందని వార్తలు కూడా వినిపించాయి.

- Advertisement -
Prabhas
Prabhas

ట్రైలర్ సిద్ధం

ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. జూన్ 7వ తారీఖున ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన వైజయంతి మూవీస్ నుంచి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు