Kalki2898AD : వీళ్ళతో నటించడం నా కల – మహామహుల గురించి ప్రభాస్ మాటల్లో

Kalki2898AD : ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా ప్రమోషన్లు గ్రాండ్ గా మొదలైపోయాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ గా ముంబై నుండే ప్రమోషన్లు స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి2898AD సినిమాపై అభిమానులు ఇప్పటికే చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు సినిమాపై ఇతర భాషల్లోనూ ఆసక్తిని పెంచేందుకు శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు (జూన్ 19) న కల్కి మేకర్స్ ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్‌ తో పాటు లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, అలాగే హీరోయిన్, త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే హాజరయ్యారు. ఇక ముంబైలో నోవాటెల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ కల్కి2898ADలో తన పనిచేసిన అనుభవాన్ని, అలాగే లెజెండరి నటులు అమితాబ్ తో, కమల్ హాసన్ తో పనిచేసిన అందరితోనూ పంచుకున్నారు.

Prabhas comments on Amitabh Bachchan, Kamal Haasan at Kalki2898AD Pre release event

వీళ్ళతో నటించడం నా కల.. నా అదృష్టం – ప్రభాస్

ఇక కల్కి2898AD (Kalki2898AD) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా రానా దగ్గుబాటి వ్యవహరించాడు. ఈ క్రమంలో ప్రభాస్‌ ను ముగ్గురు సూపర్‌స్టార్‌ లతో కలిసి ఒక చిత్రంలో పని చేయడం గురించి మీకు ఎలా అనిపించిందని అడిగినప్పుడు, ప్రభాస్ ఇలా అన్నాడు…. “మొదట, నాకు పని చేసే అవకాశం ఇచ్చినందుకు దత్ గారూ మరియు నాగి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రేటెస్ట్ లెజెండ్స్ తో ఇది కల కంటే పెద్దది, మరియు నేను అమితాబ్ సార్‌ ని మొదటిసారి కలుసుకున్నప్పుడు మరియు ఆయన పాదాలను తాకినప్పుడు ఏమి చెప్పాలో నాకు తెలియదు, అతను అలా చేయవద్దు, మీరు చేస్తే నేను కూడా చేస్తాను అన్నారని అన్నాడు.” అలాగే బిగ్ బి గురించి ప్రభాస్ ఇంకా మాట్లాడుతూ, “మేము మిమ్మల్ని చూస్తూ పెరిగాము… సౌత్, నార్త్ ఇలా దేశంలోని ప్రతి ప్రాంతానికీ చేరుకున్న మొదటి నటుడు ఈయనే, అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ మరియు ఆయన పొడుగ్గా ఉన్నాడని, ఆయన లా ఎత్తుగా ఉండే వారందర్ని మేము అమితాబ్ బచ్చన్ అని పిలుస్తారని చిన్నప్పుడు మేము చూశాము అంటూ చెప్పుకొచ్చాడు…

- Advertisement -

కమల్ గురించి ప్రభాస్ మాటల్లో…

ఇక అలాగే లెజెండరీ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ… కమల్ సార్ యొక్క సాగర సంగమం చిత్రం విడుదలైనప్పుడు, ఆ చిత్రంలో కమల్ హాసన్ ధరించిన అదే దుస్తులను తనకు కొనమని తన తల్లిని కోరినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతటి లెజెండరీ నటులతో కలిసి పనిచేయడం నమ్మశక్యం కాలేదని, థ్యాంక్యూ సార్‌… అని ప్రభాస్‌ తన చెప్పుకొచ్చాడు. అలాగే తర్వాత, దీపికా పదుకొనేతో ప్రభాస్ మాట్లాడుతూ, దీపికతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని, ఇంత అందమైన సూపర్ స్టార్‌ తో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న నటులు మరియు నటీమణులకు కల్కిలో నటించడం గొప్ప విషయమని, దీపికా పదుకొనెతో కలిసి పనిచేయడం బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ జోనర్ లో మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని మరియు కమల్ హాసన్ అలాగే, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, చెంబన్ వినోద్ జోస్, బ్రహ్మానందం మరియు ఇతర నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. జూన్ 27న వరల్డ్ వైడ్ గా కల్కి2898AD పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు