Prabhas: 12.8 మిలియన్ ఫాలోవర్స్.. కానీ ప్రభాస్ ఫాలో అయ్యే సంఖ్య తెలిస్తే షాక్..!

Prabhas.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రభాస్ ను పట్టుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు కానీ సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేదు. అయితే ఇటీవల వచ్చిన కల్కి సినిమాతో లెక్కలన్నీ మారిపోయాయి. గత ఏడాది వచ్చిన సలార్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ప్రభాస్, కల్కి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఒక్క ఈ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఇప్పట్లో ఈ రికార్డును ఇంకొకరు అందుకోవడం కూడా కష్టమే అన్నట్టుగా ఒక మార్క్ సెట్ చేశారు ప్రభాస్.

మీడియాకు కనపడని ప్రభాస్..

ఇక ప్రస్తుతం కూడా అన్నీ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్లను ప్రకటించారు. అందులో భాగంగానే సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజా సాబ్ చిత్రాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగిపోయాయి. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇందులో హీరోయిన్ గా ఎంపికయింది. ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎక్కువగా బయట కనిపించరు. సాధారణంగా ఆయన సినిమా ప్రమోషన్స్, లేదంటే సినిమా ఫంక్షన్ లో మాత్రమే కనిపించే ఈయన సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇంస్టాగ్రామ్ లో 12.8 ఫాలోవర్స్లో కలిగి ఉన్న ప్రభాస్..

అయితే ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ప్రభాస్, ఇప్పుడిప్పుడే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. తాజాగా ఈ అకౌంటులో 12.8 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు ప్రభాస్. దీన్ని బట్టి చూస్తే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఇంస్టాగ్రామ్ లో పెద్దగా పోస్ట్లు ఉండవు. ఆయన సినిమాకు సంబంధించిన విషయాల అప్డేట్స్ ఉండవు. అలాగని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఆయన ఇందులో ఇవ్వరు. అయినా సరే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మరి ఈయన ఎంతమందిని ఫాలో అవుతున్నారు అంటే ఆ సంఖ్య తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేయకమానదు.

- Advertisement -
Prabhas: 12.8 million followers.. but shock if you know the number of Prabhas followers..!
Prabhas: 12.8 million followers.. but shock if you know the number of Prabhas followers..!

ప్రభాస్ ఫాలో అయ్యేది ఈ 23 మందినే..

ముఖ్యంగా తనతో సినిమాలు చేసిన దర్శకులు, హీరోయిన్లను మాత్రమే ఆయన ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కేవలం 23 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు ప్రభాస్. అందులో మొదటగా కనిపించేది తన పెదనాన్న కృష్ణంరాజు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్, రాధాకృష్ణ, సుజీత్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, మారుతి, రాజమౌళి, ఓం రౌత్, కృతి సనన్ , దీపికా పదుకొనే, నిధి అగర్వాల్, సీనియర్ నటి భాగ్యశ్రీ , నటుడు సన్నీ సింగ్, హీరోయిన్ శృతిహాసన్, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, రిద్దికుమార్, మాళవిక మోహన్, ఇమాన్వి, ఫిలిం యాక్షన్ యూనిట్ ఎడిటర్ డి.వి బ్రాకమోంటెస్ లను మాత్రమే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు