Justin Bieber : వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాప్ సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తూ, ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా ఇండియాకు అనంత్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలో సంగీత్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ లో అత్యధిక అత్యధిక పారితోషకం తీసుకొనే సింగర్లలో ఒకడిగా జస్టిన్ బీబర్ నిలిచాడు. ఇదిలా ఉండగా తాజాగా జస్టిన్ బీబర్ తన జీవితంలో ఎంతో ఆనందకరమైన విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు. జస్టిన్ బీబర్ ఒక బిడ్డకు తండ్రి అయినట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.
మగబిడ్డకు తండ్రి అయిన జస్టిన్ బీబర్..
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) తన భార్య హేలీ బీబర్ ఒక మగబిడ్డకు జన్మనివ్వగా, ఈ సంతోషకరమైన విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లయ్యాక తన మొదటి బిడ్డను జీవితంలోకి స్వాగతిస్తూ జస్టిన్ బీబర్ ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా, అంతే కాదు తన కొడుకు పేరును కూడా పెడుతూ ఫ్యాన్స్ తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. జస్టిన్ బీబర్ – హేలీ బీబర్ కు పుట్టిన మొదటి మగ బిడ్డకు “వెల్‌కమ్ హోమ్” అని స్వాగతిస్తూ, తమ బిడ్డకు “జాక్ బ్లూస్ బీబర్” (Jack Blues Bieber) అనే పేరును పెట్టినట్టు సోషల్ మీడియాలో వెల్లడించాడు.
పిక్స్ షేర్ చేస్తూ ఆనందాన్ని తెలియచేసిన జస్టిన్..
ఇక జస్టిన్ బీబర్ – హేలీ బీబర్ (Hailey Bieber) తమ మగ బిడ్డకు, జస్టిన్ బీబర్ తండ్రి పేరు కలిసొచ్చేలా జెరెమీ మధ్య పేరు పెట్టారని సమాచారం. ఇక జస్టిన్ బీబర్ తమ బిడ్డతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇంస్టాగ్రామ్ లో ‘బేబీ కాళ్ళు మాత్రం చూపిస్తూ.. ‘జాక్ బ్లూస్’ అనే పేరుతో కూడిన క్యాప్షన్ తో పోస్ట్ షేర్ చేసారు. ఇక జస్టిన్ బీబర్ మరియు హేలీ బీబర్ 2018 లో పెళ్లి చేసుకోగా, పెళ్లి తర్వాత కొన్నాళ్ళు కెరీర్ పై దృష్టి పెట్టారు. ఇక జస్టిన్ బీబర్ భార్య హెలీ సోషల్ మీడియాలో కూడా కనిపించడం తగ్గించింది. తాజాగా పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ జస్టిన్ బీబర్ షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.