Big Breaking :టాలీవుడ్ ప్రముఖ సింగర్ మనో ( Mano ) గురించి అందరికీ తెలుసు.. ఒక్క పాటలు పాడటం మాత్రమే కాదు. స్టార్ హీరోలకు డబ్బింగ్ కూడా చెబుతాడు. ఇక ఇటీవల బుల్లి తెర పై పలు షోలల్లో జడ్జిగా వ్యవహారిస్తున్నారు. తాజాగా మనోకు పోలీసులు షాక్ ఇచ్చారు. తన కొడుకులు చేసిన పనికి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మనో కొడుకులు మద్యం మత్తులో ఓ వ్యక్తి పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చైన్నై కి చెందిన కృపాకరణ్, మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్ధి వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు.. వీరిద్దరూ ఎప్పటిలాగే అకాడమిలో శిక్షణ తీసుకొని అనంతరం ఇంటికి బయలు దేరారు. మొన్న రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత బిల్ కట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో మనో ఇద్దరు కుమారులు, మరో ముగ్గురు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ ఐదుగురు మద్యం మత్తులో ఉన్నారు. కృపాకరణ్ తో ఉత్తి పుణ్యానికే గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళ సరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారందరి పై దాడి, అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో భాగంగా ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వారిలో మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కొంతమంది వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్‌లు, కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. మరి ఇది నిజంగా దాడినా లేక ఏదైన సినిమా ప్రమోషనా తెలియలేదు కానీ ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త విన్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి కడుపున చెడపుట్టారు కదరా .. ఈ వయస్సులో ఆయన పేరును చెడగొట్టేస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఉరి తీసెయ్యండి . ఆయనకు ప్రశాంతత ఉంటుంది అంటూ మండిపడుతున్నారు. మనో విషయానికొస్తే .. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నే కాదు , ప్రముఖ సింగింగ్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.