Pawan Kalyan Vs Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య ఉన్న విభేదాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరైనోడు సక్సెస్ మీట్ లో ఎప్పుడైతే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనే మాటను వాడాడు అప్పుడు నుంచి వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఒక మనసు ఆడియో లాంచ్ లో దీని గురించి క్లారిటీ ఇచ్చిన కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్లు పాటు అలుపెరగకుండా కష్టపడి నేడు ఒక స్థాయిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గించడం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ దగ్గర కాపలా పెట్టడం ఇలాంటివి చాలా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ వీటన్నిటిని ప్రశ్నించారు.
ఇకపోతే మరోవైపు అల్లు అర్జున్ వైయస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక వైసీపీ క్యాండిడేట్ ను సపోర్ట్ చేయడానికి నంద్యాల వెళ్లారు. అక్కడితో పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వైరం మరింత పెరిగింది. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు అంటే మంచికి మారుపేరులా ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లు గా ఉంటున్నారు అంటూ ఒక సభలో చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీనితో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశాడు అంటూ చాలా కథనాలు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో అన్నాడు అని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ఇక హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ‘కళ్యాణ్ ఏ అంశం మీద మాట్లాడారో తెలియదు. తర్వాతైనా ఆయన తన వెర్షన్ ఇదీ అని చెప్పాల్సింది. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేది. బన్నీ మెచ్యూర్డ్ యాక్టర్. ఆయనకు పాలిటిక్స్‌లో కాదు యాక్టింగ్‌లో నేషనల్ అవార్డు వచ్చింది’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది