Pawan Kalyan.. పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ నిరూపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలోకి రావాలన్న కల ఒక ఎత్తైతే, ప్రజలకు మంచి చేకూర్చాలన్న ఆశయం ఇంకోవైపు.. అన్నీ ఆయనను రాజకీయంగా అడుగులు వేసేలా చేశాయి. అందులో భాగంగానే ఎన్నో అవమానాలు, అపనిందలు విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని నేడు తన పార్టీ ద్వారా ఏకంగా 100% స్ట్రైక్ విజయం సాధించి , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక రాజకీయాలలోకి రావాలనుకున్న వారికి పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శం అని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం..
ఒకవైపు సినిమాలలో బిజీగా నటిస్తూనే , మరొకవైపు రాజకీయాలలో వేగంగా దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు తన తమ్ముడికి ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. మరి నాగబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్ర స్టైల్ లో వండే పలావ్ అంటే ప్రాణం..
ఆంధ్ర స్టైల్ లో వండే పలావ్ అని పిలవబడే బిర్యాని అంటే పవన్ లొట్టలు వేసుకుంటూ తింటారని నాగబాబు చెప్పుకొచ్చారు. రోజూ తినే ఫుడ్ కంటే పలావ్ ఉన్న రోజు ఆ పలావ్ మరింత ఎక్కువ తింటారని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలపై ప్రస్తుతం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లన్నీ కంప్లీట్ చేసి మళ్లీ ప్రజల కోసం రాజకీయాలలో బిజీ కానున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ కెరియర్…
పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే.. నక్సలైట్ అవ్వాలనుకున్న ఆయనను తన వదిన సురేఖ ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చిందని సమాచారం. అలా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చిన ఈయన ఇప్పుడు ఆ ఇష్టంతోనే సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఎప్పటికైనా ప్రజలకు మంచి చేయాలనే ఆయన కోరిక బలంగా మారింది కాబట్టి నేడు ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ హీరో మాత్రమే కాదు గొప్ప డాన్సర్ కూడా. అంతేకాదు అప్పుడప్పుడు తన సినిమాలలోని కొన్ని పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించారు. ఇక దర్శకత్వంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. అలా అన్నీ కలగలిపి నేడు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు.