Pawan Kalyan : పిచ్చి పరాకాష్టకు చేరడం.. ఈ మధ్య సినీ స్టార్స్ అభిమానులు తమ అభిమాన హీరోల కోసం వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు హీరోలపై తమకు ఎంత అభిమానం ఉందో కొత్తగా చూపిస్తున్నారు. కొందరు బొమ్మలు లేదా ఆర్ట్స్, పెయింట్స్ ద్వారా ప్రయోగాలు చేస్తే మరికొందరు మాత్రం ప్రత్యేకమైన పండగలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నాం అనే సందేహం కలుగుతుంది కదూ.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం వినాయక చవితి సందర్బంగా కొత్త ఆకారాలలో బొజ్జ గణపయ్యను తయారు చేస్తున్నారు. కొన్ని విగ్రహాలను చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అవ్వడం కామన్.. తాజాగా అలాంటి వినాయకుడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను మనం చూసే ఉన్నాం.. కానీ ఈ ఏడాది వినాయక చవితి కాస్త కొత్తగా ఉందని చెప్పాలి. సూపర్ మ్యాన్ నుంచి వినాయకుడికి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు సినీ స్టార్స్ బాడితో వినాయకుడిని తయారు చేస్తున్నారు.. గత రెండు రోజులుగా నెట్టింట రకరకాల ఆకారాల్లోని వినాయకుడి విగ్రహాలను చూసాం.. మొన్న ఏమో పుష్ప ( Pushpa ) వినాయకుడి ఫోటోలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కటౌట్ తో ఉన్న వినాయకుడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ ను పోలిన వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ ఫోటోనే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ఈ విగ్రహం పెట్టడానికి కారణాలు కూడా ఉన్నాయి. గతంలో జాలర్ల కోసం పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఒక చేతిలో వల మరో చేతిలో జాలరి గంప పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు అదే ఫోటోను ఆధారంగా చేసుకుని ఒక విగ్రహాన్ని తయారు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరిపారు అక్కడి ఫిషింగ్ హార్బర్ వర్కర్లు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక నెటిజన్స్ మాత్రం ఇదేం పిచ్చి రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ (Pwan Kalyan ) నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఏం ( AP Dcm ) గా బాధ్యతలను చేపట్టారు..