Pavitra – Darshan: పవిత్ర కు 54.. దర్శన్ కు 47.. క్రైమ్ కథా చిత్రం షురూ..!

Pavitra – Darshan: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల ఎఫైర్స్ ద్వారా కన్నడ పరిశ్రమ భారీ పాపులారిటీ దక్కించుకుంటోందని చెప్పవచ్చు.. కాంతారా, కే.జి.ఎఫ్ సినిమాలకు మించి ఎఫైర్స్ ద్వారానే ఈ పరిశ్రమ ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా నిలుస్తోందని చెప్పవచ్చు.. మొన్నటి వరకు పవిత్ర జయరాం గురించి వార్తలు రాగా.. ఇప్పుడు దర్శన్ ఏకంగా హత్య కేసులో అరెస్టయి అందరిని ఆశ్చర్యపరిచారు. కన్నడ హీరో దర్శన్ వయసు 47 ఏళ్లు.. సీరియల్ నటి పవిత్ర గౌడ వయసు 54 యేళ్లు.. వీరిద్దరూ పదేళ్లు సహజీవనం చేశారని.. పెళ్లి కూడా చేసుకున్నారనే ప్రచారం జరుగుతున్నా.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎక్కడ లేదనే చెప్పాలి. వీళ్ళిద్దరి ప్రేమ ఇప్పుడు క్రైమ్ కథ చిత్రం గా మారిపోయింది.. ఎంతలా అంటే ఈ సంఘటన దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతోంది తన ఫాన్స్ ఒక అభిమానిని ఒక సినిమా హీరో దర్శన్ హత్య చేయడం వెనుక ఏం జరిగింది? ఎందుకు జరిగింది ? అసలు ఎలా జరిగింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

భార్య పిల్లలు ఉన్నా ఇంకొక నటితో పదేళ్ల నుండి ఎఫైర్..

Pavitra - Darshan: Pavitra is 54.. Darshan is 47.. Crime story movie is starting..!
Pavitra – Darshan: Pavitra is 54.. Darshan is 47.. Crime story movie is starting..!

దర్శన్ విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీలో కష్టపడి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు.. హీరో అయ్యారు.. దీంతో కొంతమంది ఈయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు.. అంతేకాదు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.. హీరో దర్శన్.. సీరియల్ నటి, మోడల్ అయిన పవిత్ర గౌడ తో రిలేషన్ లో ఉన్నారు ..ఇద్దరు విహారయాత్రలకు వెళ్లడం.. సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య లివింగ్ రిలేషన్ ఉన్నట్లు కన్ఫామ్ అయ్యింది.. ఈ విషయం తెలిసి హీరో దర్శన్ ఇంట్లో గొడవలు కూడా జరిగాయట.. రోజు రోజూకు ఇంట్లో గొడవలు పెరగడంతో.. చివరికి ఇంటి గొడవలు వీధికి ఎక్కాయి. ఇక దర్శన్ , పవిత్ర గౌడ ఫోటోలు.. వాళ్ళిద్దరి రిలేషన్ గురించి దర్శన్ భార్య పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.. దీనితో ఇంట రచ్చ రోడ్డు కెక్కింది.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు కూడా వినిపించాయి..

వ్యక్తిగతంగా దూషించి.. పవిత్ర గౌడ ఇగో దెబ్బతీసిన రేణుక స్వామి..

ఇదంతా ఇండస్ట్రీలో సాధారణంగా జరిగే వ్యవహారమని కొంతమంది చూసినా.. కొంతమంది దర్శన్ అభిమానులు మాత్రం రకరకాల కామెంట్లతో ఇద్దరి ఇగో లను హర్ట్ చేశారు. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ తన ఇన్స్టా లో దర్శన్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. మా రిలేషన్ కు పదేళ్లు.. హ్యాపీ టెన్త్ రిలేషన్షిప్ యానివర్సరీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది..అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన దర్శన్ వీరాభిమానిగా ఉన్న 33 ఏళ్ల రేణుక స్వామి అనే యువకుడు.. నెగిటివ్ కామెంట్ చేయడం మొదలుపెట్టాడు.. నీవల్లే మా దర్శన అన్న ఫ్యామిలీలో గొడవలు అంటూ కామెంట్ చేశాడు. పవిత్ర క్యారెక్టర్ పై కామెంట్లు చేశాడు. పవిత్ర గౌడ వల్లే దర్శన్ కెరియర్ నాశనమైందని.. నీవల్లే దర్శన్ జీవితంలో గొడవలు వచ్చాయంటూ వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టాడు.. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతూనే వచ్చింది. ఇక పవిత్ర గౌడ ఇగో దెబ్బతింది..

- Advertisement -

రేణుకా స్వామిని చంపేయాలని దర్శన్ పై ఒత్తిడి తెచ్చిన పవిత్ర గౌడ..

రేణుక స్వామిని ఏదైనా చేయమని దర్శన్ పై ఒత్తిడి తీసుకొచ్చింది పవిత్ర గౌడ.. అంతేకాదు రేణుక స్వామిని బంధించి.. కొట్టాలని.. చంపాలని కూడా ఆమె పగ ప్రతికారాలను దర్శన్ పై రుద్దిందట.

రూ.30 లక్షలు సుఫారీ..

ఇక క్షణికావేశంలో ఉన్న దర్శన్ ఏమి ఆలోచించకుండా 30 లక్షల రూపాయల సుఫారీ ఇచ్చి.. తన ఫ్యాన్స్ సంఘంలోని సభ్యులతోనే రేణుక స్వామినీ కిడ్నాప్ చేయించి మరీ చంపేశారు.. ఇక ఈ క్రైమ్ స్టోరీ ఒక సినిమాని తలపిస్తోందని చెప్పవచ్చు.

పెళ్లీడుకొచ్చిన పిల్లలు.. ఇప్పుడు రిలేషన్..

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పవిత్రకు 18 ఏళ్లకే పెళ్లయి.. పెళ్ళీడు కు వచ్చిన కుమార్తె కూడా ఉంది.. ప్రస్తుతం ఈమె వయసు 54 ఏళ్ళు అట.. దర్శన్ వయసు 47 ఏళ్ళు.. అతడికి కూడా 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారంటే.. వీరు ఎంతలా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా ప్రేయసి కోసం హత్య చేయడం ఎంత దారుణమో.. ఇక దర్శన్ పై అభిమాన సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతడినా మేము ఆరాధ్య హీరోగా భావించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా ప్రేయసి కోసం ఏకంగా అభిమానినే హత్య చేసి జైలుకెళ్లాడు దర్శన్.. ఇక ఇంతకంటే దారుణం మరి ఎక్కడ ఉండదేమో..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు