Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ (Vivek Atreya) – నాని కాంబోలో ‘అంటే సుందరానికి’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “సరిపోదా శనివారం” ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. మరీ యనానిమస్ రేంజ్ లో కాకపోయినా, ప్రేక్షకులు మెచ్చేలానే సినిమా ఉండడంతో చాలా రోజుల తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇక నాని ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేసాడని చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాలి.
థియేటర్ల విషయంలో హర్ట్ అయిన నాని ఫ్యాన్స్..
అయితే సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ లో భారీగానే థియేటర్లు దొరికినా, ఇతర భాషల్లో మాత్రం థియేటర్లు ఇవ్వలేదు. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి సంబంధించి నాని సినిమాకి థియేటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. ‘సరిపోదా శనివారం’ హిందీలో “సూర్యస్ సటడే” (Surya’s Saturday) పేరుతో రిలీజ్ అవగా, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ థియేటర్ల పరంగా ముంబైలో కేవలం 6 థియేటర్లు మాత్రమే ఇచ్చారట. తెలుగు వెర్షన్ కి మరో 9 కలిపి మొత్తం పదిహేను థియేటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నాని (Nani) ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత అయినా స్క్రీన్స్ సంఖ్య పెంచడం లేదని నెట్టింట నాని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఓపెనింగ్స్ లో కుమ్మేసిన నాని.. కానీ?
ఏది ఏమైనా సరిపోదా శనివారం మొదటి రోజు థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. దసరా తర్వాత నాని కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిల్చింది. వరల్డ్ వైడ్ గా 11.67 కోట్ల షేర్, 20 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 30 కోట్ల దూరంలో ఉంది. అయితే టాక్ బాగుండడంతో వీకెండ్ లో కుమ్మేసే ఛాన్స్ ఉంది. అయితే వచ్చిన రెస్పాన్స్ ని బట్టి, ఇప్పుడైనా ఇతర భాషల్లో సరిపోదా శనివారం సినిమాకి థియేటర్ల సంఖ్య పెంచాలని నాని అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ (Dvv Entertainments) థియేటర్ల విషయంలో ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.