Jr NTR : బాలీవుడ్ బ్యూటీపై మోజు పడ్డ తారక్… బీ టౌన్‌లో దారుణమైన ట్రోల్స్..!

 

Jr NTR: గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఎన్టీఆర్ (Jr NTR). ఈ మధ్యకాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుకుంటున్నారు. టెంపర్ సినిమా నుంచి మొదలు పెడితే వరుసగా 6 విజయాలను అందుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే జోరున కొనసాగిస్తున్న ఎన్టీఆర్ వరుసగా ప్రాజెక్టులను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కొరటాల శివ (Koratala siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సముద్రపు కథ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నారు. గతంలో ఎప్పుడూ చూడని వైల్డ్ కాన్సెప్ట్ తో రాబోతున్న దేవర సినిమాకి సంబంధించిన షూటింగ్ గత సంవత్సరం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూల్స్ ను జరుపుకుంటూ వస్తున్నారు. మొదటి పార్ట్ కు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. అయితే దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) పరిచయం కాబోతోంది.

- Advertisement -

ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన శ్రీదేవి కూతురుగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. దేవర సినిమాలో (Devara) బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్, తారక్ మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయిందట. అయితే వీరిద్దరికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ని తారక్ చాలా ఇష్టపడుతున్నారట. జాన్వి కపూర్ తో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. కానీ జాన్వీ కపూర్ మాత్రం కాస్త ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుందని సమాచారం. టాలీవుడ్ స్థాయి నాది కాదు, బాలీవుడ్ స్థాయి అంటూ టెంపర్ చూపిస్తోందట జాన్వి. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా స్టార్ ఉమెర్ సంధు పేర్కొనడం జరిగింది.

Telugu audience's reaction to Janhvi Kapoor's beauty in the movie Devara

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఉమైర్ సందు. అయితే.. ఈ పోస్ట్‌ చూసిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జాన్వీని ఆడుకుంటున్నారు. కాగా దేవర ట్రైలర్ ఈవెంట్ తాజాగా ముంబైలో జరిగింది. ఈవెంట్ కి జాన్వి చీర కట్టులో హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా జాన్వి మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీకి వెళుతుంటే తనకు సొంత ఇంటికి వెళుతున్నట్టుగా ఫీలింగ్ వస్తుందని చెప్పింది. ఇది తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పడం జరిగింది. కాగా దేవర సినిమాలో తంగం పాత్రలో జాన్వి కపూర్ నటించింది. పక్కా పల్లెటూరి అమ్మాయిగా లంగా వోణీలో జాన్వి మరింత అందంగా కనిపించింది. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషలలో విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

https://x.com/UmairSandu/status/1833498467316224446?t=FK33XRO8Yaq2XhsZm_e_Ug&s=08

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు