Daavudi Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు. మొన్న సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నా కూడా మరోవైపు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు మూడో సాంగ్ ను విడుదల చేశారు. ‘కొరమీనా నిన్ను కోసుకుంటా ఈయాలా..’కిలి కిలి కిలియే.. అంటూ ఈ పాట సాగుతోంది. ఈ డ్యూయెట్ సాంగ్ ఫుల్ ఫాస్ట్ బీస్ట్‌తో ఉంది. ఎన్టీఆర్, జాన్వీకపూర్ల స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా తెలుగులో నకాష్ అజీస్, అక్ష ఆలపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
ఈ పాట రిలీజ్ అయిన వెంటనే కాఫీ అంటూ ట్రోల్స్ మొదలైయ్యాయి. సెకండ్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పాటకు కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుధ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారని తెలుస్తుంది. మ్యూజిక్ అసల్ బాలేదు. సాంగ్ లిరిక్స్ బానే ఉన్నా… సరిగ్గా సెట్ అయినట్టు లేదు.. అనిరుధ్ లవ్ సాంగ్స్ ఇచ్చాడు బాగానే. కానీ, ఈ డ్యాన్స్ నెంబర్ కు మాత్రం చేతులెత్తేశాడు.. అనిరుధ్ నుంచి లాస్ట్ 2 సాంగ్స్ (చుట్టముల్లే, ఫియర్ సాంగ్) కు అనిరుధ్ మార్క్ లో ఇచ్చాడు.. కానీ, ఈ డ్యాన్స్ నెంబర్ కి మాత్రం ఫెయిల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక సెప్టెంబర్ 27 ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటివరకు మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..