NKR21 : టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డెవిల్ తో ప్లాప్ అందుకున్నా, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తాను నిర్మించిన దేవర (Devara) చిత్ర నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూనే, తన సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన21వ (NBK21) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకోగా, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ గురించి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది.
భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో మేకర్స్..
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ (KalyanRam) హీరోగా నటిస్తున్న తన 21వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ హంగులతో తెరకెక్కుతుండగా, కొన్ని వారాల క్రితమే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేయగా, తాజాగా మరో షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్ గురించి అప్డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మేకర్స్ మరో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ షూట్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ అద్వర్యంలో భారీ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తుండగా, ఈ ఫైట్ సీన్ లో ఏకంగా 150 మంది ఫైటర్స్, 300 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నట్టు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.
నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి ప్లాన్…
ఇక కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తి అయిపోగా, ఇయర్ ఎండ్ కల్లా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి (Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, అశోక క్రియేషన్స్ బ్యానర్ లో సంయుక్తంగా అశోక్ వర్ధన్ ముప్ప తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు సమాచారం. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.