Nivetha Thomas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో నివేద థామస్ ఒకరు. ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti Mohan Krishna) దర్శకత్వం వహించిన జెంటిల్మెన్(GentleMan) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది నివేద. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. నాని(Nani) లో ఉన్న బెస్ట్ పర్ఫామెన్స్ ను బయటకు తీసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నానితోపాటు నిన్ను కోరి అనే ఒక సినిమాలో పనిచేసింది నివేదా. ఈ సినిమాతోని శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
నివేదా థామస్ తన కెరీర్లు మంచి సినిమాలను ఎంచుకుంటూ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా(Brochevarevaruraa) అని సినిమాలో మిత్ర అనే పాత్రలో కనిపించింది నివేదా. ఈ సినిమా నివేదాకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి ఒక సినిమాలో నటించింది నివేదా. ఆ సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాని చేశారు. ఈ సినిమా హిందీ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది.
తెలుగులో ఈ సినిమాను అనన్య నాగళ్ళ, అంజలి, నివేద థామస్ ప్రధాన పాత్రలు కనిపిస్తూ చేసారు. ఈ సినిమాలో నివేదా పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సుందరానికి అనే సినిమా ఈవెంట్ కి నివేద హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ అందరి గురించి మాట్లాడుతూ చివర్లో నివేదా ను చూశారు. ఆమె గురించి వెళ్ళిపోతున్న వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి మాట్లాడుతూ ఆవిడ మంచి పర్ఫార్మర్ అని చెబుతూ వచ్చారు.
ఇక రీసెంట్గా నివేదా 35 అనే ఒక సినిమాను చేసింది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రానా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు ఇంటర్నేషనల్ పాల్గొంటుందో నివేదా. ఈ ఇంటర్వ్యూస్ లో మా వకీల్ సాబ్ ను మినిస్టర్ గా చూస్తుంటే గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఆయన చేయడం వల్లే వకీల్ సాబ్ సినిమాకి అంత పేరు వచ్చింది అంటూ తెలిపింది నివేద థామస్.