Nivetha Pethuraj : ఆ పార్ట్ కు సర్జరీ చేయమన్న హీరోయిన్… చంపేస్తానని డాక్టర్ బెదిరింపులు

Nivetha Pethuraj : యంగ్ హీరోయిన్ నివేత పెతురాజ్ సౌత్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. అదృష్టం కలిసి రాలేదు గానీ లేకపోతే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది ఈపాటికి. అందం, అభినయం కావలసినంత ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం ఈ అమ్మడి దరి చేరట్లేదు. తాజాగా నివేత తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. కానీ ఎందుకు ఆగిపోవలసి వచ్చిందో కూడా వెల్లడించింది.

ఆ పార్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ

ఈ అచ్చమైన అరవ అమ్మాయి తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ముఖ్యంగా కోలీవుడ్లో విజయ్ ఆంటోనీ, విజయ్ సేతుపతి, ఉదయనిది స్టాలిన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీ కి స్టార్ హీరోయిన్ అన్న బిరుదు మాత్రం ఆమడ దూరంలో ఆగిపోయింది. మధురైలో పుట్టి పెరిగిన నివేదా తమిళ సినిమాల ద్వారానే వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత పెద్దగా తమిళంలో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ బాట పట్టింది. కానీ ఇక్కడ కూడా ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రాలేదు. అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించినప్పటికీ నివేతను పెద్దగా అవకాశాలు వరించలేదు. కానీ మంచి నటిగా పేరు మాత్రం సంపాదించుకోగలిగింది.

Nivetha Pethuraj slams reports of a politician bought her Dubai home | Telugu Cinema

- Advertisement -

ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో వెబ్ సిరీస్ తో నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా పరువు అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోను విడుదల చేసి వివాదంలో చిక్కుకున్నట్టుగా అందరినీ నమ్మించేసింది. ఆ తర్వాత ఇది సినిమా ప్రమోషన్ కోసం అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేత పెతురాజ్ తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాను అంటూ తన గురించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టింది.

నిత్యా మీనన్, సాయి పల్లవితో పోలిక

తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనే కోరిక ఉండేదని, కానీ డాక్టర్ బెదిరింపుల వల్ల వెనక్కి తగ్గాను అని చెప్పుకొచ్చింది. నివేత మాట్లాడుతూ నాకు ప్లమ్ లిప్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నా పెదాలు అలా మార్చుకోవాలని దాని కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని మా ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. ఇంజక్షన్ తీసుకుంటావా అనగానే ఓకే చెప్పేసాను. కానీ డాక్టర్ మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేను చంపేస్తాను అని సరదాగా బెదిరించారు. అలాగే వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో వివరించారు. ఇప్పటికైతే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీల ద్వారా ముఖాలు మార్చుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం అది మంచిది కాదు. సర్జరీ చేయించుకోకుండానే సాయి పల్లవి నిత్యమీనన్ లాంటి హీరోయిన్లు ఎంతో అందంగా ఉన్నారు కదా అంటూ తనకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో నివేత ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆలోచనను పక్కన పెట్టేసిందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు