Nithin : సినిమా మంచిగా తియ్యకపోతే మీ ఊరుకొచ్చి కొడతా అన్నాడు – ఆదిత్య హాసన్

Nithin: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఆదిత్య హాసన్ ఒకరు. ఈటీవీ విన్ లో ప్రసారమైన 90s అనే సిరీస్ తో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఈ సిరీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 90 కిడ్స్ యొక్క చిన్నప్పటి జ్ఞాపకాలని అద్భుతంగా ఆవిష్కరించాడు ఆదిత్య. ఈ సిరీస్ తర్వాత ఆదిత్య కు విపరీతమైన అవకాశాలు వచ్చాయి. అందులో నితిన్ తో కూడా సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 90 సిరీస్ చాలామందికి నచ్చడంతో ఫోన్ చేసి మరి చాలామంది అభినందించారు.

ఇక నితిన్ తో సినిమా ఓకే అయింది అని బయట వార్తలు రాగానే ఒక నెంబర్ నుంచి ఆదిత్య(Aditya Hasan) కు మెసేజ్ వచ్చింది. మా అన్నతో సినిమా చేస్తున్నావ్, సినిమా ఏమైనా బాగా లేకపోతే మీ ఊరికి వచ్చి కొడతా అని ఆ మెసేజ్ సారాంశం. అయితే కొన్ని రోజుల తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ప్రేమలు తెలుగు వెర్షన్ ఆదిత్య హసన్ రాసాడు. తెలుగులో కూడా ప్రేమలు సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. కేవలం వారం రోజుల్లో ప్రేమలు సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ ను రాసేసాడు ఆదిత్య. ఇక డైలాగ్స్ కూడా ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకులు కూడా ఆ డైలాగ్స్ ను ప్రశంసించారు.

90s director Aditya Haasan

- Advertisement -

ఇకపోతే ప్రేమలు(Premalu) తెలుగు వెర్షన్ విడుదలైన తర్వాత ఎవరైతే మెసేజ్ పెట్టారు అదే అబ్బాయి ఆదిత్య హాసన్ ను పొగుడుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. పర్లేదు ఈ ఈ డైరెక్టర్ మా హీరోతో మంచి సినిమా తీస్తాడు అనే నమ్మకం తనకి కలిగింది. అంటూ ఆదిత్య స్పందించాడు. ఇక నితిన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇక నితిన్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే ప్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదిత్య నితిన్ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు