Swayambhu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ “స్వయంభు” అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తికేయ2 సినిమా తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ని కూడా పాన్ ఇండియా రేంజ్ చేస్తున్నాడు. అందులో భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా “స్వయంభు” (Swayambhu) సినిమా కూడా ఒకటి. భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ సినిమా నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన మలయాళ భామ సంయుక్త మీనన్ (Samyuktha menon) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నభా నటేష్ (Nabha natesh) కూడా రెండో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నిఖిల్ స్వయంభు సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగతా భాగం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
బడ్జెట్ లిమిట్స్ దాటిపోయిన నిఖిల్ సినిమా..
ఇక నిఖిల్ (Nikhil) నటిస్తున్న స్వయంభు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తెరకెక్కుతుండగా, ముందుగా ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ అనుకోగా, క్రమంగా 70 కోట్లకు ఎగబాకింది. ఎలాగో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నాం కదా అని నిర్మాత అనుకున్నా, ఇప్పుడు బడ్జెట్ లిమిట్స్ ఏకంగా 80 కోట్లు దాటిపోయిందని సమాచారం. ఇప్పటికైనా మేకర్స్ పక్కాగా ప్లాన్ చేసుకోకపోతే వంద దాటేలా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే మార్కెట్ దృష్ట్యా నిఖిల్ సినిమా 30 కోట్లు మించలేదన్న మాట వాస్తవం. కార్తికేయ2 ని పక్కన బెడితే నిఖిల్ ఏ సినిమా కూడా 40 కోట్లు కూడా రాబట్టలేదు. అయితే స్వయంభు సినిమా పీరియాడిక్ సినిమా కాబట్టి ఇంత బడ్జెట్ అవుతుంది, ఇక సినిమాను సెంట్రల్ కెమెరామెన్ గ్రాఫిక్స్ లోనే చాలా వరకు సినిమా పూర్తి చేస్తున్నారని సమాచారం.
నిర్మాతకు లాభాలు వస్తాయా?
అయితే నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాకు అసలు లాభాలు వస్తాయా అని ట్రేడ్ విశ్లేషకుల మాట. ఎందుకంటే స్వయంభు (Swayambhu) సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమాకి డిజిటల్, సాటిలైట్ రైట్స్ తో మహా అయితే ఓ 40 కోట్లు రావచ్చు, ఇక థియేట్రికల్ బిజినెస్, రిలీజ్ అయ్యే టైం కి 40 నుండి 60 కోట్ల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో బడ్జెట్ 80 కోట్లు దాటిందంటే నిర్మాతకు పెద్దగా వచ్చే లాభాలు ఏమి ఉండవని ట్రేడ్ విశ్లేషకుల మాట. ఒకవేళ లాభాలు రావాలంటే బడ్జెట్ లిమిట్ దాటకూడదు, అలాగే నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకుంటే, సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బడ్జెట్ లిమిట్స్ దాటితే నిర్మాతకు లాభాలు ఏమి ఉండవని టాక్. మరి స్వయంభు సినిమా పూర్తయ్యే నాటికి బడ్జెట్ ఎంతవుతుందో చూడాలి.