Re Release Movies : టాలీవుడ్ లో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ ఇయర్ సమ్మర్ తర్వాత రీ రిలీజ్ ల హడావిడి తగ్గిపోగా, మళ్ళీ మురారి(Murari) రీ రిలీజ్ తో ఊపందుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఆ సినిమా రీ రిలీజ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర (Indra) సినిమా కూడా రీ రిలీజ్ లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ (Gabbar singh) కూడా రీ రిలీజ్ లో మోత మోగించిన విషయం తెలిసిందే. మధ్యలో నాగార్జున మాస్ కూడా రీ రిలీజ్ అయింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ నటించిన “3” మూవీ కూడా రీ రిలీజ్ కాగా ఈ సినిమాని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అయితే వచ్చే వారం టాలీవుడ్ లో మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సందడి రాబోతుంది.
ఒక్కరోజు గ్యాప్ లో 4 సినిమాలు…
ఇక ప్రస్తుతం రాబోయే పాన్ ఇండియా సినిమా “దేవర” (Devara) వచ్చే వరకు పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి, నెక్స్ట్ వీక్ ని మొత్తం రీ రిలీజ్ సినిమాలు కబ్జా చేసేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈసారి ఒకటి కాదు, రెండు కాదు ఒకేసారి 4 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అవును.. ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్క రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో మొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ (Shivaji) సినిమా సెప్టెంబర్ 20న రీ రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే నెక్స్ట్ డే మిగతా మూడు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. శర్వానంద్, జై ప్రధాన పాత్రల్లో నటించిన “జర్నీ” (Journey) సినిమా సెప్టెంబర్ 21న రీ రిలీజ్ అవుతుండగా, సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన “బొమ్మరిల్లు” (Bommarillu) కూడా అదే రోజు రీ రిలీజ్ అవుతుంది. అలాగే రవితేజ నటించిన “వెంకీ” (Venky) సినిమాను కూడా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా?
అయితే ఇన్ని సినిమాలను ఒక్కసారిగా రీ రిలీజ్ చేస్తుండడంతో చాలామంది మూవీ లవర్స్ ఇన్ని సినిమాలు ఒకేరోజు ఎందుకు, కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. పైగా కొంతమందికి సినిమా చూడాలన్నా, ఒకేసారి అంటే బడ్జెట్ ప్రాబ్లెమ్.. పైగా రీ రిలీజ్ సినిమాలు ఒకేసారి వస్తే కూడా ప్రేక్షకులు ఒకే సినిమాని ఎంచుకునే అవకాశం ఉంది. అందువల్ల బయ్యర్లకు పెద్దగా లాభం వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఒక్కోవారం లో ఒక్కో సినిమా రీ రిలీజ్ చేస్తే బెటర్ అన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాల్లో రవితేజ నటించిన వెంకీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.