Prabhas : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోపై ఏదైనా ఒక ఇష్యూ గాని, విమర్శ గాని వచ్చిందంటే.. అది కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో వేడెక్కుతూనే ఉంటుంది. దాని గురించి మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి సినిమా గురించి మాట్లాడుతూ ఏకంగా ప్రభాస్ ని జోకర్ అనేశాడు. సినిమాలో అమితాబ్ ముందు ప్రభాస్(Prabhas) ఒక జోకర్‌లా కనిపించాడు… అంటూ అర్షద్ వర్షి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెట్టింట దారుణంగా ఫైర్ అవుతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ తో పాటు అభిషేక్ అగర్వాల్, సుధీర్ బాబు, ఆది వంటి పలువురు సినీ ప్రముఖులు అతడిపై సీరియస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నెటిజన్లు మాత్రం అర్షద్ వార్సీ ని సమర్థిస్తూ పాత విషయాలని తవ్వి తీస్తున్నారు.
ప్రభాస్ ముందు హృతిక్ ఎందుకు పనిచేయడు… – రాజమౌళి
ఇక నోరుజారిన అర్షద్ వర్సి కి ప్రభాస్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ వేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ పై ఇలా కామెంట్స్ చేయడం సరికాదంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal), అలాగే హీరోలు సుధీర్ బాబు, ఆది వంటి హీరోలు రియాక్ట్ అయ్యారు. అయితే బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు టాలీవుడ్ పై కౌంటర్లు వేస్తున్నారు. పాత విషయాలని కూడా తవ్వితీస్తూ, పలు స్టేట్మెంట్లను, వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ (Hruthik Roshan) పనిచేయడు అంటాడు.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట మళ్ళీ వైరల్ అవుతుంది.
మరి జక్కన్న హృతిక్ ని అన్నపుడు ఏమైంది…
ఇక అప్పట్లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరగగా, ఆ ఈవెంట్ కి రాజమౌళి (SS Rajamouli) స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఆ ఈవెంట్ లో ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ… “ధూమ్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్లకే అంత క్వాలిటీ ఎందుకొస్తుంది.. హృతిక్ రోషన్ లాగ మనకి హీరోలు లేరా? మన హీరోలతో అలాంటి సినిమాలు తీయలేమా? అని అనుకున్నాను… కానీ బిల్లా (Billa) లో సాంగ్, పోస్టర్లు, ట్రైలర్ చూశాకా ఒక్కటే అనిపించిందండి… హృతిక్ రోషన్ ప్రభాస్ ముందు ఎందుకు పనిచేయడు.. అని కౌంటర్ వేస్తూ.. తెలుగు సినిమాను బాలీవుడ్ లెవల్ కూడా దాటి హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన మెహర్ రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తాడు. ఇక ఈ వీడియో ని ఇప్పుడు వైరల్ చేస్తూ, మరి అప్పుడు రాజమౌళి అన్నప్పుడు ఎం చేసారు.. ఇది కరెక్టేనా? అని బాలీవుడ్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.