Indra Re-Release: ఆ ఒక్క తప్పు వలన పాతికవేలు పోగొట్టుకున్న అల్లు అర్జున్

Indra Re-Release: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకి ఎటువంటి ప్రత్యేకమైన స్థానం ఉందో అలానే కమర్షియల్ సినిమా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కు రావడం తగ్గించేశారు కానీ ఒకప్పుడు విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళు. వారందరినీ ఎంటర్టైన్మెంట్ చేయటమే లక్ష్యంగా అప్పుడు చాలామంది దర్శకులు సినిమాలు తీసేవాళ్లు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసే దర్శకులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే తెలుగులో వచ్చిన మాస్ కమర్షియల్ ఫ్యాక్షన్ సినిమాలలో ఇంద్ర ఒకటి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం మామూలుది కాదు. బి గోపాల్ (B.Gopal) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) నటించిన ఈ సినిమా ఎన్నో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత సరైన ఫ్యాక్షని సినిమా ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాలేదు అని చెప్పాలి. ఈ సినిమాకి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. చిన్నికృష్ణ అందించిన కథ, పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్ వేటికవే ప్రత్యేకం.

ఇంద్ర సినిమాతో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంద్ర సినిమాతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమా వలన అల్లు అర్జున్ పాతికవేల రూపాయలు నష్టపోయాడు. ఇంద్ర సినిమాలో వీణపాటలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన ఫ్రెండ్ మాత్రం పక్కన సోనాలి కూడా ఉంటుంది అంటూ ఆర్గుమెంట్ మొదలుపెట్టాడు. దీనితో పాతికవేల రూపాయలు తనతో బెట్టు కట్టాడు అల్లు అర్జున్. ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఆ పాట చూడగానే పక్కనే సోనాలి బింద్రే కూడా ఉంది.

- Advertisement -

Indra

మెగాస్టార్ బర్త్డే ఈవెంట్ లో ఈ విషయాన్ని షేర్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను ఇంద్ర సినిమా 17 సార్లు చూశాను. అయితే ఆ పాటలో కేవలం చిరంజీవి గారిని మాత్రమే చూశాను అంటూ అప్పట్లో ఒక భారీ ఎలివేషన్ ఇచ్చాడు అల్లు అర్జున్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు