Nbk50Years: మేమంతా ఒక కుటుంబంలా ఉంటాము, ఫ్యాన్స్ అర్థం చేసుకోండి- చిరంజీవి

Nbk50Years: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్విజయంగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని, నేటికీ ఒక సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. తన కెరీర్ లో బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ కూడా చేశారు. భైరవద్వీపం(Bairava Dweepam), ఆదిత్య 369(Aditya369) వంటి సినిమాలను బాలయ్య ఆరోజుల్లోనే చేసారు. ఎన్నో కమర్షియల్ సినిమాలను కూడా బాలకృష్ణ ప్రేక్షకులకు అందించారు.

ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. దీనిని చాలామంది అభిమానులు పర్సనల్గా కూడా తీసుకుంటూ మీ హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చాలా విమర్శలు కూడా చేసుకునేవాళ్లు. అప్పట్లో సినిమాల్లో కూడా వాళ్ళ చరిత్ర గురించి కుటుంబాల గురించి డైలాగ్స్ ఉంటూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో అది బాగా మారింది అని చెప్పొచ్చు. అందరూ కలిసి ఏకదాటిగా ముందుకు వెళ్ళటం మొదలుపెట్టారు. రీసెంట్ గా బాలకృష్ణ 50 సంవత్సరాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా అతిథిగా హాజరవుతూ కొన్ని అమూల్యమైన మాటలు పంచుకున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ..

బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక.

- Advertisement -

Balakrishna

ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు