NBK 50 Years Event : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇది ఒక ప్రభంజనం. చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక అతీత శక్తి. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. చాలామంది ఒకటి రెండు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత ఫెడవుట్ అయిపోయారు. ఏఎన్ఆర్(Anr), ఎన్టీఆర్(Ntr), సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna), శోభన్ బాబు(Sobhan Babu), కృష్ణంరాజు(Krishanam Raju) వంటి అగ్ర నటుల మధ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను క్రియేట్ చేసుకుని, తనకు తానుగా ఎదిగాడు.
ఒక ఎన్టీఆర్ నట వారసుడుగా నందమూరి బాలకృష్ణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఒకప్పుడు మాత్రం వీరి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. బాలకృష్ణ చిరంజీవి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతూ ఉండేవి. వీరికి అభిమానులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఏ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది. డాన్సులు ఎవరు బాగా చేస్తారు. ఫైట్స్ ఎవరు బాగా చేస్తారు. అంటూ ఆ రోజుల్లో పెద్ద పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉండేవి. ఇక సినిమాలలో కూడా ఇన్ డైరెక్ట్ గా డైలాగ్స్ వేస్తూ ఉండేవాళ్ళు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గురించి రాజకీయాల్లోకి అందరూ పనికిరారు అమితాబచ్చన్ అలానే అయ్యారు చిరంజీవి కూడా అలానే అయ్యారు అంటూ విమర్శలు చేశారు. ఒక సందర్భంలో నాగబాబు బాలకృష్ణ గురించి విపరీతంగా మాట్లాడి ఆ బాలకృష్ణ ఎవరో నాకు తెలియదండి ప్రముఖ కమెడియన్ బాలకృష్ణ ఫోటోని చూపించిన రోజులు కూడా ఉన్నాయి. సింహ వంటి సినిమాల్లో చరిత్ర అంటే మాది వంటి డైలాగ్స్ కూడా అప్పట్లో విపరీతంగా ఫేమస్ అయ్యాయి. ఇక బ్యానర్లపై కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని పోస్టర్లు వేసేవాళ్లు.
ఇక రీసెంట్ టైమ్స్ లో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి, ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి త్రిబుల్ ఆర్ సినిమా చేయటం. అక్కడితో ఫ్యాన్వర్స్ చల్లబడతాయని కొంతమంది అనుకున్న కూడా, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప మీ హీరో పాత్ర ఏముంది అంటూ సోషల్ మీడియా వేదిక కూడా ఫైట్స్ మొదలయ్యాయి. ఇక అన్ స్టాపబుల్ షో తర్వాత చాలామందికి బాలకృష్ణ బాగా క్లోజ్ అయ్యారు. అలానే రామ్ చరణ్ కి కూడా బాలయ్య ఎంత క్లోజ్ అని అప్పుడే అందరికీ తెలిసి వచ్చింది. ఇక ఈ సందర్భంగా బాలయ్య 50 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ కండక్ట్ చేసి అందర్నీ ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్ పవర్
ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ డామినేషన్ చాలా క్లియర్ గా కనిపించింది. కొంతమంది మెగాస్టార్ ఏంటి అంత ఆటిట్యూడ్ తో ఉన్నారు అని చాలామంది భావించారు. వాస్తవానికి మెగాస్టార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీని కారణం మెగాస్టార్ వ్యక్తిగత జీవితంలో సాధించలేనిది, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధించాడు. దాదాపు 10 ఏళ్లపాటు ఒక పార్టీని నడిపించి, విమర్శలు ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు చేపట్టారు. అలానే దాదాపు ఒక పార్టీ పని అయిపోయింది అనుకునే తరుణంలో వెన్ను దన్నుగా నిలబడి ఆ పార్టీని నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ఉంటుంది అని చాలామంది మాట్లాడుకుంటారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వాళ్లలో బాలకృష్ణ కూడా ఉన్నారు. అయితే వాటికి తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఏదేమైనా పవర్ స్టార్ పవర్ లో లేకపోయినా కూడా ప్రతిపక్షానికి తన పవర్ ఏంటో చూపించారు. ఆ తరువాత చాలామంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో పాటు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో అర్థమైంది. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ వాళ్ళనే మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్లో అంత కాన్ఫిడెంట్ గా కనిపించారు అనేది చాలామంది చెప్పుకునే మాట.