Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటీకే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేయగా, చిత్ర యూనిట్ నెలరోజుల నుండి గ్యాప్ లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. పంద్రాగస్టు సినిమాలు పూర్తిగా దెబ్బేయడంతో ప్రేక్షకులు ఇప్పుడు మంచి ఆకలిమీదున్నారని చెప్పాలి. అందుకే ఇలాంటి టైం లో భారీ అంచనాలతో సరిపోదా శనివారం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా నాని తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశాడు.
తిరుమలకు కాలినడకన నాని..
తాజాగా నాని సరిపోదా శనివారం ప్రమోషన్ లో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శనానికి రావడం జరిగింది. అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకున్నాడు నాని. ఇక నాని ఒక్కడే కాకుండా తన భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చాడు. ఇక నడకమార్గంలో నానితో పలువురు భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న నాని, తిరిగి వెంటనే తన సినిమాల ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా చాలామంది సెలెబ్రిటీలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. రీసెంట్ గా చిరంజీవి ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
100 కోట్ల వసూళ్లే టార్గెట్..
ఇక సరిపోదా శనివారం సినిమాకు నెలరోజుల ముందుగానే మేకర్స్ ప్రమోషన్లు చేయడం స్టార్ట్ చేయగా, ట్రైలర్ రిలీజ్ తర్వాత అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ టూర్లు వేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. రీసెంట్ గా నాని ముంబై కి కూడా వెళ్లి హిందీ ప్రమోషన్లు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో అప్పుడే 100k వసూళ్లు దాటిందని సమాచారం. ఈ సినిమాతో నాని ఫస్ట్ డే రికార్డ్స్ లో మరోసారి కెరీర్ బెస్ట్ కొడతాడని, ఈసారి 100 కోట్ల షేర్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు. అయితే సరిపోదా శనివారం ఇతర భాషల ట్రైలర్లు ఇంకా రిలీజ్ చేయలేదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.