Nara Rohith: బాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ సోలో సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇప్పటికీ పరశురాం కెరియర్ లో బెస్ట్ వర్క్ ఏది అంటే సోలో అని చెప్పాలి. ఆ తర్వాత గీత గోవిందం అని చెప్పొచ్చు. ఇక సోలో సినిమా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నారా రోహిత్ ను దగ్గర చేసింది. సోలో సినిమా తర్వాత పరుశురాంకి కూడా దర్శకుడుగా వరుస అవకాశాలు వచ్చాయి.
ఇక నారా రోహిత్ వరుసగా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశాడు. నారా రోహిత్ సినిమా అంటేనే విభిన్నమైన కాన్సెప్ట్ లు ఉంటాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నారా రోహిత్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎన్నో విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుని అద్భుతమైన సినిమాలను తన కెరియర్లో చేసేసాడు. అయితే నారా రోహిత్ ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. విభిన్నమైన సినిమాలు చేస్తున్న తరుణంలో కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయ్యి సరైన రిజల్ట్ రాకపోవడం జరిగింది. అక్కడితో సినిమాలు చేయడం తగ్గించాడు.
దాదాపు 8 సంవత్సరాల క్రితం సుందరకాండ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇక ఆ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో ఒక జర్నలిస్ట్ మీరు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు చేస్తారు అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు అని అడిగారు. దానికి నారా రోహిత్ అద్భుతంగా ఆన్సర్ చేశారు.
సుందరకాండ సినిమా ప్రొడ్యూసర్స్ కి ముందుగా థాంక్యూ చెబుతూ ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు సీఎం అవుతారని వాళ్ళు గెస్ చేశారు అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమా అనేది ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలైంది. అయితే కొన్ని కారణాలు వలన ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఎట్టకేలకు పూర్తి అయిపోయిన ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే పనిలో పడ్డారు మేకర్స్.