Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాని వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, ఇంతకు వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి ఈ కాంబోలో ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఇక ఇప్పటీకే సరిపోదా శనివారం సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేయగా, చిత్ర యూనిట్ నెలరోజుల నుండి గ్యాప్ లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో నాని (Nani) తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
నా సినిమాకు వందలకోట్లు అక్కర్లేదు – నాని
టాలీవుడ్ లో మీడియం రేంజ్ స్టార్ హీరోల్లో టాప్ ఫామ్ లో ఉన్నది నానియే. తనకు సూట్ అయ్యే సరికొత్త కథా, కథనాలతో ప్రేక్షకులని మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా సరిపోదా శనివారం గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది అని విలేఖరి అడిగిన ప్రశ్నకు నాని ఊహించని సమాధానం ఇచ్చాడు. తన కెరీర్ బిగినింగ్ నుండి ప్రేక్షకులని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, పాన్ ఇండియా లాంటివి ఇప్పుడు అంటున్నారు గాని,.. ఒకప్పుడు కూడా దేశ వ్యాప్తంగా మన తెలుగు సినిమాలు కూడా బాగా ఆడాయని చెప్పుకొచ్చాడు. అయితే తనకు వందల కోట్ల సినిమాలు అక్కర్లేదని.. తన సినిమాలతో ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తే తనకంతే చాలని, తన సినిమాలు తాను చేస్తూ పోతే ఎదో ఒకరోజు పాన్ ఇండియా రేంజ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాతో 100 కోట్లు కొడతాడా?
ఇక ఈ ఇయర్ కల్కి తర్వాత ఆశించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా రాలేదు. పంద్రాగస్టు సినిమాలు పూర్తిగా నిరాశపరచగా, ఇప్పుడు ఆడియన్స్ దృష్టి అంతా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాపైనే ఉంది. దీంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ ఇయర్ దసరా తో 100 కోట్ల గ్రాస్ అందుకున్న నాని, ఈ సారి సరిపోదా శనివారం సినిమాతో 100 కోట్ల షేర్ ని కూడా అందుకుంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.