Nani: కొన్నిసార్లు ఎంతో నమ్మకంతో చేసిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉంటాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమా మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ పోస్టర్ చూసిన వెంటనే ఒకప్పుడు టెన్త్ క్లాస్ లో ఉండే బారిష్టర్ పార్వతీశం స్టోరీ అందరికీ గుర్తొచ్చింది. అప్పటికే వివేక ఆత్రేయకు తన కెరీర్ లో వరుసగా రెండు హిట్ సినిమాలు ఉన్నాయి. మెంటల్ మదిలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన బ్రోచేవారెవరురా సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.
అంటే సుందరానికి(Ante Sundaraniki) సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆ తర్వాత ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ టైంలో సినిమా పరిశ్రమంలో ఉండే కొన్ని సమస్యలకు నాని చాలా ఓపెన్ గా మాట్లాడాడు. ఆ విషయంలో నానిని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), సుకుమార్(Sukumar) రిలీజ్ కంటే ముందే చూసారు.
ఈ సినిమా గురించి కూడా చాలా అద్భుతమైన మాటలు ఈ ఇద్దరు దర్శకులు మాట్లాడారు అక్కడితో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ చాలామందికి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చింది. కొంతమంది మాత్రం ఈ సినిమా మూడు గంటల పాటు ల్యాగ్ తప్ప ఇంకేమీ లేదు అంటూ మాట్లాడారు. కేవలం వివేక్ సాగర్ మ్యూజిక్ మాత్రమే ఈ సినిమాను కొంతమేరకు కాపాడింది అని చెబుతూ వచ్చారు.
ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇంత మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ ఎలా ఫెయిల్ చేశారు అంటూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది. రీసెంట్గా మరోసారి ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి స్పందించాడు నాని. నా నుంచి ఒక కామెడీ ఫిలిం ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు మేము స్లో డ్రామా సినిమాను ఇచ్చాము. వివేక్ నాకు ఏ కథ అయితే చెప్పాడో ఆ కథను అలానే తీశాడు దీంట్లో ఫెయిల్యూర్ కి ఏదైనా తప్పు ఉందంటే అది నా వల్లనే అంటూ నాని చెప్పుకొచ్చాడు.