Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో స్టార్ హీరోల పోటీ రెగ్యులర్ గా ఉంటుందని తెలిసిందే. అలాగే హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా విపరీతమైన పోటీ, కంపారిజన్లు ఉంటాయి. కొన్ని తరాల నుండి కూడా ఇండస్ట్రీలో మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప అని, తమ హీరోకి ఎక్కువ హిట్లున్నాయని ఒక హీరో ఫ్యాన్స్, తమ హీరోకి ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయని మరో స్టార్ ఫ్యాన్స్ వార్లు చేయడం కామన్ అయిపొయింది. ఇది ఏ ఇండస్ట్రీలో అయినా కామనే. ఒకప్పుడు ఆఫ్లైన్ లో కొట్టుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో వార్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని సార్లు శృతిమించిపోతున్నారని చెప్పాలి. ఒక స్టార్ హీరో హిట్ కొట్టడం కూడా ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. తాజాగా నాని (Nani) విషయంలో ఫ్యాన్స్ వార్ మళ్ళీ జరుగుతుంది.
నాని సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నారా?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. అయితే నెట్టింట మాత్రం ఈ సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్. ఈ సినిమా యనానిమస్ రేంజ్ లో కాకపోయినా, ప్రేక్షకులు మెచ్చేలానే సినిమా ఉండడంతో మంచి వసూళ్లు వస్తుండగా, నానికి మరో సక్సెస్ ఆల్మోస్ట్ ఖాయమైందని చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ కి సరిపోదా శనివారం సక్సెస్ అంతగా పడడం లేదని టాక్.
వీరి మధ్య వార్ ఎండ్ అవదా?
ఇక నాని సరిపోదా శనివారం సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది ఎవరో కాదు, విజయ్ దేవరకొండ (Vijaydevarakonda) ఫ్యాన్స్. టైర్2 హీరోల్లో ప్రస్తుతం టాప్ లో ఉంది నాని, విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. వీరి తర్వాత రామ్ పోతినేని (Ram pothineni) ఉన్నాడు. అయితే విజయ్ సినిమాలు కొంత కాలంగా అండర్ పెర్ఫార్మన్స్ చేస్తుండగా, ఇదే సమయంలో నాని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తుండటంతో నెట్టింట వార్ నడుస్తుంది. తమ హీరోకి రికార్డ్స్ ఉన్నాయని విజయ్ ఫ్యాన్స్, తమ హీరోకి సక్సెస్ ఎక్కువున్నాయని నాని ఫ్యాన్స్, ఇక ఏవేవో లెక్కలు తీస్తూ సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు. నిజానికి కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయినా ఆడుతుంది. ఇక స్టార్ డమ్ అనేది ఆయా హీరోల సినిమాల సెలక్షన్స్, సక్సెస్ పెర్సెంటేజ్, ఇంకా మార్కెట్ ఇలా సవాలక్షా కారణాలుంటాయి. మొత్తంగా టైర్2 హీరోల్లో టాప్ లో ఉంది నాని మాత్రమే అని చెప్పాలి. మరి తర్వాత విజయ్ దేవరకొండ తన సినిమాలతో నాని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.