Nani : కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు ఫెయిల్ అవుతుంటాయో ఎవరికీ అర్థం కాదు. అలానే కొన్ని సూపర్ హిట్ సినిమాలు చూసినప్పుడు అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది అని ఫీలింగ్ కూడా వస్తుంది. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా అంటే సుందరానికి. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ను సాధించలేకపోయింది. ఈ సినిమాకి ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే సుందరానికి సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది.
ఇకపోతే వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచుతుంది. ఎస్ జె సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్లో నాని మాట్లాడుతూ ఈ సినిమాపై తన కాన్ఫిడెంట్ ని తెలియజేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండి సినిమా ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండేవాడిని, కానీ జేక్స్ బిజోయ్ ఆర్ఆర్ చూసిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు కూడా చెప్తున్నాను ఒక బస్తా పేపర్లు ఎక్కువ పట్టుకుని రండి అంటూ తన కాన్ఫిడెన్స్ తెలియజేసాడు నాని.