Nani : నా నెక్స్ట్ సినిమాకి చిన్న పిల్లలకు అనుమతి లేదు… స్టోరీ చెప్పిన నాని

Nani : నాచురల్ స్టార్ నాని గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం నాని రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ, మరోవైపు డీసెంట్ క్లాస్ ఫిలిమ్స్ అని కూడా చేస్తున్నాడు. ఇప్పటివరకు నాని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే దసరా అని చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ఈ సినిమా తర్వాత నాని చేసిన సినిమా హాయ్ నాన్న(Hi Nana). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ నిలిచింది. ఇక రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సినిమాను అందుకున్నాడు నాని. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వం వహించాడు. వీరి కాంబినేషన్లో ఇదివరకే అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ను సాధించలేకపోయింది. అయితే ఈసారి కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టాలి అని వివేక్ ఆత్రేయ తన స్టైల్ మార్చే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ కన్ఫామ్ అయిపోయింది. దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది.

Nani

- Advertisement -

ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ దసరా సినిమా రిలీజ్ అయినప్పుడు పిల్లలు తీసుకువెళ్లాల వద్ద అని ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే అది యాక్షన్ సినిమా కాబట్టి, సరిపోతా శనివారం విషయానికి వస్తే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్లొచ్చు ఇది ఎంటర్టైన్మెంట్ వే లో ఉండే ఒక యాక్షన్ ఫిలిం అంటూ చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ నా నెక్స్ట్ సినిమాకి పిల్లలకి అనుమతి లేదు అంటూ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అని రివిల్ చేశాడు. ఇకపోతే నాని తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సెకండ్ టైం పని చేయనున్నాడు. నాని చెప్పిన మాటలు బట్టి చూస్తే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉండేలా అనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు