Nani: చాలా ఏళ్ల క్రితం దర్శకుడుగా ఒక సినిమాను మొదలు పెట్టి అప్పుడు వచ్చిన కొన్ని అడ్డంకులు కారణంగా సినిమాను మధ్యలోనే ఆపేశాడు నెల్సన్(Nelsan). మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత నయనతార ప్రధాన పాత్రలో కొలమావు కోకిల(Kolamavu Kokila) అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. డార్క్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ను సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వరుణ్ డాక్టర్(Doctor) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు నెల్సన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్(Beast) సినిమా డిజాస్టర్ అయింది. అయితే అప్పటివరకు మంచి దర్శకుడుగా పేరు సాధించుకున్న నెల్సన్ ఒక ప్లాప్ సినిమా పడగానే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే సన్ నెట్వర్క్ సంస్థతో జైలర్ అనే సినిమాకు కమిట్ అయ్యాడు నెల్సన్. ఇక రజనీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెల్సన్ కెరీర్ కు అది స్ట్రాంగ్ కం బ్యాక్ ఫిలిం అయింది.
నాచురల్ స్టార్ నాని బీస్ట్ సినిమా గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా చెన్నైలో సుహాసిని మణిరత్నం చేసిన ఒక ఇంటర్వ్యూలో విజయ్(Vijay) పూజా హెగ్డే(Pooja Hegdhe) నటించిన బీస్ట్ సినిమా పై మంచి అంచనాలు ఉండేవి. ఈ సినిమాలో విజయ్ చాలా కూల్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ నాకు చాలా బాగా అనిపించాయి. కానీ ప్రేక్షకులు నెల్సన్ నుంచి అంతకుమించి ఇంకేదో కోరుకున్నారు. అందుకే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఏదేమైనా జైలర్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు అదే హ్యాపీ అంటూ చెప్పుకొచ్చాడు నాని.