Nani: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్లు వినిపిస్తాయి. వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు సినిమాలు రీ రిలీజ్ అయితే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా(Pushpa) సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. ఇకపోతే ఇండస్ట్రీలో టైర్ వన్ టైర్ టు టైర్ త్రీ అని మూడు వర్గాల హీరోలు ఉన్నారు.
టైర్ వన్ విషయానికి వస్తే అల్లు అర్జున్, ప్రభాస్(Prabhas) ,ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Ram Charan) పేర్లు వినిపిస్తాయి. అంటే వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే విపరీతమైన ఓపెనింగ్స్ వస్తాయి. ఆ తర్వాత టైర్ టు హీరోలలో నాని, రామ్ పోతినేని(Ram Pothineni), విజయ్ దేవరకొండ వంటి హీరోల పేర్లు వినిపిస్తాయి. ఇకపోతే వీటన్నిటిని కూడా ఎవరు కనిపెట్టారు అని పర్టికులర్ గా చెప్పలేము. సోషల్ మీడియా యూత్ అంతా ఇలాంటి డిస్కషన్స్ ఫ్యాన్ వార్స్ పెడుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా నాని నటించిన సినిమా సరిపోదా శనివారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో నాని టైర్ వన్ లోకి వచ్చేసాడు అంటూ కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదే విషయంపై నాని స్పందించాడు.
ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఈ సినిమాతో నాని టైర్ వన్ హీరో అయిపోయినట్లేనా అని అడిగినప్పుడు. ఈ గోల నుంచి నన్ను వదిలేయండి. అసలు అవి ఎవరు కనిపెట్టారు నాకు ఇవన్నీ తెలియవు అంటూ మాట్లాడాడు. అయితే దీనికి సమాధానంగా మీ ఫ్యాన్స్ కనిపెట్టారు అంటూ చెబుతూ వచ్చారు. ఇదే తరుణంలో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ నాని గురించి ఎక్కువ ఫాన్వర్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయని అంటే, నాని పిల్ల జమిందార్ సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు. నాని అంటే సుందరానికి సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు. నాని జెర్సీ సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు. నాని దసరా సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ సినిమాలు గురించి డిస్కషన్ పెడుతూ ఉంటారు.
ఒక్కో సినిమాతో నాని ఒక్కొక్క వర్గపు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అని క్లారిటీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ.ఇక జెర్సీ(Jersey) సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది కేవలం కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా మరోవైపు నానితో పని చేసిన దర్శకులు అవార్డ్స్ కూడా అందుకుంటున్నారు. సరిపోదా శనివారం సక్సెస్ జోష్లో ఉన్న నాని మరికొద్ది రోజుల్లో హిట్ 3 షూటింగ్లో జాయిన్ అవుతారు.