SaripodhaaSanivaaram : నానిని చూసి స్టార్ హీరోలు చాలా నేర్చుకోవాలి..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటీకే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేయగా, చిత్ర యూనిట్ నెలరోజుల నుండి గ్యాప్ లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఎలాగూ పంద్రాగస్టు సినిమాల హడావుడి అయిపోయింది. ఆ సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ అయ్యాక పూర్తిగా థియేటర్లో జనాలు లేని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ దృష్టి అంతా ‘సరిపోదా శనివారం’ సినిమాపైనే ఉంది. దీంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు.

Nani is doing solid promotions for Saripodhaa Sanivaaram

నాని ని చూసి స్టార్ హీరోలు నేర్చుకోవాలి..

ఇక సరిపోదా శనివారం సినిమాకు నెలరోజుల ముందుగానే మేకర్స్ ప్రమోషన్లు చేయడం స్టార్ట్ చేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ టూర్లు వేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇదిలా ఉండగా నాని అయితే ఆల్మోస్ట్ నెలరోజులుగా సినిమాని తనదైన శైలిలో ప్రమోట్ చేస్తుండగా, ఇప్పుడు ఇతర భాషల్లో కూడా వరుస ప్రమోషన్లు చేస్తూ ఉన్నాడు. అయితే నాని ఇంత భారీగా ప్రమోషన్లు చేస్తూ ఉండడంతో, తనని చూసి స్టార్ హీరోలు చాలా నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా స్టార్ హీరోలు ఎవరూ సినిమా ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. అందరూ కాదు గాని, కొందరు స్టార్ హీరోలు ఓ రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చి సైలెంట్ అయిపోతున్నారు. ఇక ఇతర భాషల గురించి అసలు పట్టించుకోవడమే లేదు.

- Advertisement -

కానీ నాని (Nani) సరిపోదా శనివారం సినిమాకు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వీలైనంత వరకు గ్యాప్ లేకుండా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే చెన్నై, కొచ్చి, బెంగుళూరు వంటి నగరాల్లో సరిపోదా శనివారం సినిమాని ప్రమోట్ చేసారు. త్వరలో ముంబై కి కూడా వెళ్లనున్నారు. ఇక రీసెంట్ గా కొందరు స్టార్ హీరోలు కూడా సినిమాని ఓవర్ ప్రమోట్ చేసి, ఇంటర్వ్యూ లలో కథ గురించి లేనిపోనివి చెప్పి హైప్ పెంచేశారు. దాంతో జనాలు పూర్తిగా దెబ్బేసారు. ఇక కొందరైతే ఇంటర్వ్యూ లలో కూడా భజన ప్రోగ్రాంలు పెట్టారు. దాంతో జనాలకు ఆ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే నాని తన సినిమాలని ఎంచుకునే విధానం, అలాగే ప్రమోట్ చేసే విధానాన్ని చూసి కొందరు స్టార్ హీరోలు చాలా నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం..

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా రిలీజ్ కి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా ఓవర్సీస్ లో 100k వసూళ్లు దాటిందని సమాచారం. ఈ సినిమాతో నాని ఫస్ట్ డే రికార్డ్స్ లో మరోసారి కెరీర్ బెస్ట్ కొడతాడని, స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ కొల్లగొడతాడని కొల్లగొడతాడని అంటున్నారు. కంటెంట్ క్లిక్ అయితే ఈ సారి వంద కోట్ల షేర్ ని సైతం సరిపోదా శనివారం అందుకునే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు