Nani about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేచురల్ స్టార్ నాని వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించేలా టికెట్ రేట్లను తగ్గించినప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో పాటుగా చాలా ఓపెన్ గా మాట్లాడాడు నాని. అప్పుడు నాని మాట్లాడిన మాటలు వలన చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే నానికి పవన్ కళ్యాణ్ కి మధ్య అనుబంధం అక్కడితో స్ట్రాంగ్ గా మారింది. నాని నటించిన అంటే సుందరానికి అనే సినిమాకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ రెండు సినిమాలు డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. రీసెంట్ గా సుమా కనకాల చేసిన ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాని(Nani).
ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తోంది. సేమ్ బ్యానర్లు పవన్ కళ్యాణ్ నానితో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటి అని అడిగితే, ఇద్దరూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పింది. ఆ మాటలకు కంటిన్యూస్ గా నాని మాట్లాడుతూ నేను సినిమాలు గురించి ఆలోచిస్తుంటాను, ఆయన మాత్రం ప్రజల గురించి ఆలోచిస్తుంటాడు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.