HBD Nagarjuna : టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో కింగ్ నాగార్జున చాలా ప్రత్యేకంగా ఉంటాడు. లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకుని, నట సామ్రాట్ గా, అభిమానులచేత ‘కింగ్’ గా పిలిపించుకున్నాడు. మూడున్నర దశాబ్దాలుగా సీనియర్ అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఇప్పటికి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో ఎన్నో సార్లు ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున తాను చేసిన ప్రయోగాలు ఎవ్వరూ చేయలేరు అన్నట్టుగా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 90స్ లో “శివ” తో నాగార్జున క్రియేట్ చేసిన సరికొత్త ట్రెండ్ ని ఎవ్వరూ అంత త్వరగా మర్చిపోలేరు.
ట్రెండ్ సెట్ చేసే కింగ్..
టాలీవుడ్ లో మాస్ కి పెట్టింది పేరుగా నాగార్జున నిలిచిపోయాడు. ఒక గీతాంజలి, ఒక శివ, ఇంకా చెప్పాలంటే.. హలొ బ్రదర్, అన్నమయ్య, మాస్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాత్మక చిత్రాలు చేసాడు. రెండో తరం స్టార్ హీరోల్లో నాగార్జున చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేరని చెప్పాలి. అన్నమయ్య లాంటి క్లాసిక్ సినిమా చాలు నాగార్జున ప్రతిభ గురించి చెప్పడానికి. ఇక ఇప్పుడు కూడా మనం, ఊపిరి లాంటి క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కింగ్ నాగార్జున బర్త్ డే (HBD Nagarjuna) స్పెషల్ గా నాగ్ నటించిన “మాస్”(Mass4k) సినిమాని థియేటర్లలో నిన్న ఆగష్టు 28న రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే థియేటర్లో నాగ్ ఫ్యాన్స్ కి మరో ఊహించని గిఫ్ట్ దొరికిందని చెప్పాలి.
SHIVA re releasing in 4 K ..Here’s the trailer playing in a theatre pic.twitter.com/ntSXhiJ6jL
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2024
మాస్ థియేటర్లో ఫ్యాన్స్ కి ఊహించని గిఫ్ట్..
ఇక నాగార్జున (Nagarjuna) నటించిన మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో రీ రిలీజ్ కాగా, నాగార్జున అభిమానులతో పలు థియేటర్లు కిక్కిరిసిపోయాయి. అయితే సినిమా పూర్తయ్యాక నాగ్ ఫాన్స్ కి స్పెషల్ సప్రయిజ్ దొరికింది. మాస్ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో నాగార్జున నటించిన ట్రెండ్ సెట్టర్ “శివ” మూవీ టీజర్ ని ప్లే చేసారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు శివ (Shiva) మళ్ళీ రాబోతుందని అనౌన్స్ చేసారు. ఇక టీజర్ రాగానే థియేటర్లలో నాగ్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహం ప్రదర్శించారు. ఇక ఫ్యాన్స్ సందడి చేస్తున్న శివ టీజర్ థియేటర్ రెస్పాన్స్ ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక వర్మని ట్యాగ్ చేస్తూ రిలీజ్ డేట్ ఎప్పుడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈరోజు (August29) నాగార్జున బర్త్ డే సందర్బంగా ఫిల్మిఫై తరపున నాగార్జునకు హ్యాపీ బర్త్ డే.