గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అవస్థలు అంతా ఇంతా కాదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చెయ్యలేక పోతున్నారు. ప్రజల అవస్థలను చూసిన తెలుగు హీరోలు సాయం అందించడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ భాధితులను ఆదుకోవాలని భారీగా ఆర్థిక సాయాన్ని అందించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో హీరో వచ్చి చేరారు. ఆ హీరోనే అక్కినేని నాగార్జున.. ఆయన మొదట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
అందరు స్టార్ హీరోలు వరద భాధితులను ఆదుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం రెండు రోజులుగా మౌనంగా ఉన్నాడు. స్టార్ హీరోలు భారీగా విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా కూడా ఈయన మాత్రం సైలెంట్ గా ఉండటంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని గంటల క్రితం Filmify కూడా నాగార్జున మౌనం గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని కుటుంబం స్పందించి భారీ విరాళాన్ని ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి రూపాయలు ప్రకటించారు.
అక్కినేని నాగార్జున సినిమాలు లేకున్నా కూడా సాయం చెయ్యాడానికి మాత్రం ఎప్పుడు వెనకడుగు వెయ్యలేదు. కానీ తెలుగు రాష్ట్రాల వరద భాధితులకు సాయం చెయ్యడానికి మాత్రం కాస్త ఆలస్యం చేశాడు. దీనిపై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. నాగ్ కన్వెన్షన్ ను కూల్చివెయ్యడంతోనే ఆయన విరాళం ఇవ్వలేదని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడ్డారు. కొన్ని గంటల వరకు నాగ్ రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఆయన స్పందించి భారీ సాయాన్ని అందించారు. నాగ్ ఒక్కడే కాదు, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవితో పాటుగా పలువురు సెలెబ్రేటీలు సాయాన్ని ప్రకటించారు.