Samantha: అక్కినేని నాగచైతన్య గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తక్కువ సమయంలోనే ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
వివాహం చేసుకున్న నాలుగేళ్లకు విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత నాగచైతన్య ఎవరికి వారు వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు అనేక రకాల రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ లవ్ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ రోజున అంటే ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో ప్రైవసీతో చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరగబోతుందని ఓ న్యూస్ హల్చల్ అవుతోంది. ఓవైపు నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి ముందు సమంత ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్లు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ సమంత తన పోస్టులో పెట్టారు.
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్ళను పైనుంచి ఓ శక్తి తప్పకుండా కాపాడుతుందని, ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుందని….అలాంటి సమయంలో నీ మానసిక స్థితి చాలా గొప్పది. నీకు ఎప్పుడు మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ ఫోగట్ గురించి సమంత ఓ పోస్ట్ పెట్టింది. అయితే సమంత వినేష్ తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టిందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ గా మారింది.