Naga Chaitanya.. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) తన సినిమాల కంటే వ్యక్తిగత కారణాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ మాయ చేసావే సినిమాలో నటించిన హీరోయిన్ సమంత (Samantha) తో ప్రేమలో పడి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈయన.. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు . ఇక విడాకుల తర్వాత మళ్లీ తన సినిమాల పైన ఫోకస్ చేసిన నాగచైతన్య అనుకోకుండా ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Sobhita dhulipala) తో ప్రేమలో పడి ఆమెతో డేటింగ్ చేశారు. ఇక ఎట్టకేలకు ఏడాది ఆగస్టు 8వ తేదీన ఆమెతో నిశ్చితార్థం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచారు నాగచైతన్య. తన సినిమాల కంటే కూడా ఆయన తన వ్యక్తిగత కారణాలవల్లే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉన్నారు.
నాగచైతన్య సినీ కెరియర్ కు 15 సంవత్సరాలు..
ఇదిలా ఉండగా చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం కస్టడీ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ను చవి చూసింది. ఇక ఇప్పుడు తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడాది 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం తండేల్ మూవీ నుంచి నాగచైతన్య లుక్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
నాగచైతన్య సినిమాలు..
ఇకపోతే నాగచైతన్య సినీ కెరియర్ విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున , దగ్గుపాటి లక్ష్మి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య 2009లో వచ్చిన జోష్ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈయన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా 100% లవ్ , దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా, మనం, ఒక లైలా కోసం, దోచేయ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఇలా దాదాపు 25 కు పైగా చిత్రాలలో నటించారు నాగచైతన్య.
సినిమాలే కాదు వెబ్ సిరీస్ కూడా..
ఇక సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించారు. గత ఏడాది దూత అనే వెబ్ సిరీస్ లో నటించిన నాగచైతన్య, ఈ వెబ్ సిరీస్ తో మంచి ఇమేజ్
సొంతం చేసుకున్నారు.
తండేల్ మూవీ నుంచి పోస్టర్ వైరల్..
ఇకపోతే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం తండేల్. ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన చిత్రం ఇది. అక్టోబర్ 11వ తేదీన దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లవ్ యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో మరొకసారి సాయి పల్లవి నటిస్తోంది. 2018 లో ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకం పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య లుక్ చాలా అద్భుతంగా ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.