Mrunal Thakur..ఒకప్పుడు బాలీవుడ్ సీరియల్స్, సినిమాలంటూ బాలీవుడ్ కే పరిమితమైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. తెలుగులో దుల్కర్ సల్మాన్ (Dulquer salman)హీరోగా హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో వచ్చిన సీతారామం (Sitaramam)సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమై, మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన ఈమెకు ఫస్ట్ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ లభించింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో తన అందం , అభినయంతో తెలుగువారిని కట్టిపడేసింది.
మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసు దోచుకున్న మృణాల్..
ఈ సినిమాతో అవార్డులు కూడా అందుకున్న ఈమె ఆ తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఇందులో అద్భుతమైన నటన కనబరిచినందుకు ఇటీవల సైమా అవార్డు కూడా లభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందివ్వకపోవడంతో మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది మృణాల్. ఇప్పుడు హిందీలో వరుస అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొని, తన లవ్, బ్రేకప్ గురించి చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. గత ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని అయినా సరే తాను బాధపడడం లేదు అంటూ తెలిపింది.
ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగింది..
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. మనకు సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు చాలామంది అలా వస్తూ ఇలా వెళ్తూ ఉంటారు. అయితే మనకు ఎవరు సెట్ అవుతారు అనేది మాత్రం మనకే తెలుస్తుంది. నా జీవితంలో కూడా నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. కానీ అతడితో రిలేషన్ అనేది నాకు నచ్చలేదు. నేను ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చాను. రిలేషన్షిప్ గురించి అడిగితే ఆలోచించాలి అన్నాడు. దాంతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాము. అయితే అలా ప్రేమించానో లేదో ఇలా అతడు గురించి తెలిసి బ్రేకప్ చెప్పుకున్నాను. అందుకే 7 నెలల క్రితం నాకు బ్రేకప్ జరిగినా పెద్దగా నేను బాధపడడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.
కాబోయే భర్తకి అలాంటి లక్షణాలు ఉండాలి..
అంతేకాదు తనకు కాబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి లుక్స్ పరంగా అందంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మంచి మనసు వున్న వ్యక్తి అయి ఉండాలి. నన్ను అర్థం చేసుకుని నా వృత్తిని గౌరవించాలి అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తే ఖచ్చితంగా అతడితో జీవితం పంచుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు లైఫ్ లో ఎన్నో బ్రేకప్ జరిగాయి. కానీ అంతగా వాటికోసం నేనేమీ బాధపడలేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పి మళ్ళీ వార్తల్లో నిలిచింది.