MrBachchan : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా ఆగష్టు 15న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీ రైడ్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను హరీష్ శంకర్ తనదైన శైలిలో పలు మార్పులు చేసి తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకోగా, సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా కావడంతో సినిమా కంటెంట్ పై అభిమానులు గట్టి నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ వచ్చాయి.
వరుస ప్లాపులు పడ్డా.. తగ్గని మాస్ బిజినెస్..
ఇక మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నుండి వచ్చిన గత మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే మిస్టర్ బచ్చన్ సాలిడ్ బిజినెస్ చేసిందని చెప్పాలి. రవితేజ – హరీష్ శంకర్ కాంబో హైప్ వల్లో, లేక ట్రైలర్ కంటెంట్ ని చూసో గాని మిస్టర్ బచ్చన్ సినిమాకి బిజినెస్ గట్టిగానే జరిగిందని చెప్పాలి.
మిస్టర్ బచ్చన్ ఏరియా వైస్ బిజినెస్ లెక్కలు చూస్తే..
నైజాం 11.50 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్ర 11.50 కోట్లు జరగగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 28 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి మరో 2 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా మిస్టర్ బచ్చన్ సినిమాకు 31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే 32 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.
చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా జాతరే..
ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ కెరీర్ లో టైగర్ నాగేశ్వరరావు (37 కోట్లు) సినిమా తర్వాత అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా మిస్టర్ బచ్చన్ నిలిచింది. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లు అందుకునే ఛాన్స్ ఉంది. పైగా పంద్రాగస్టు నుండి రాఖి పండగ వరకు లాంగ్ వీకెండ్ దొరుకుతుంది కాబట్టి, టాక్ ని బట్టి వీకెండ్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.